Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బొజ్జగణపయ్య మెచ్చిన ఉండ్రాళ్లు

బియ్యం: 1cup
శెనగపప్పు నానబెట్టుకున్నవి: 2tbsp
జిలకర: 1/2tbsp
తురిమిన కొబ్బరి: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 2cup
తయారు చేయు విధానం:
1. బియ్యాన్ని కడిగి నీళ్లు వంపుకోవాలి. తరువాత వాటిని ఒక పేపరు మీద ఆరబెట్టాలి. బాగా పొడిగా ఆరా లంటే కనీసం గంట సేపు అలాగే వుంచాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా వుండేలా చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నీటిని బాగా కాగనివ్వాలి. మరుగుతున్న నీటిలో నానబెట్టుకున్న శెనగపప్పు, జిలకర్ర వేసుకుని సన్నని మంట పై మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో బియ్యం రవ్వను ఉండలు కట్టకుండా కలుపుతూ పోయాలి.
3. ఇప్పుడు కావసినంత ఉప్పు వేసి, మొత్తం నీళ్ళు ఇగిరిపోయే వరకు సన్నని మంట పై ఉడకనివ్వాలి. కొబ్బరి తురుమును కూడా ఇందులోనే వేసుకోవాలి. బాగా ఉడికిన తరువాత స్టౌ ఆపివేసి పిండిని దించుకోవాలి.
4. ఆవిరి బయటికి వెళ్ళకుండా పాత్ర పై మూత పెట్టాలి. 15 నిమిషాల తరువాత మూతతీసి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
5. రవ్వ గనుక బిగుసుకుపోయినట్లు అయితే కొద్దిగా నీళ్ళు చల్లుకుని వుండలుగా చేసుకోవాలి. ఇడ్లీ ప్లేటులో రవ్వ వుండలను పెట్టి ఆవిరిపై ఉడి కించాలి. పది నుండి పది హేను నిమిషాలు ఆవిరి పై ఉడికించాలి. అంతే బొజ్జగణపయ్యకు నచ్చిన ఉండ్రాళ్లు రెడీ..



Click it and Unblock the Notifications