Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
కోల్డ్ ను తరిమికొట్టే జింజర్(అల్లం) సూప్...
బుతువును బట్టి వాతావరణంలో మార్పులు చోటు చేసుకొంటాయి. వాతారవణంలో మార్పులతో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా శీతాకాంలో జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్, ముక్కులో కారడం, ఎక్కువగా తలనొప్పి వంటివి అతి సాధారణంగా, సహజంగా వచ్చేటటువంటి సమస్యలు. అయితే వీటికి మాత్రలు తీసుకొన్న వేడిగా ఒక కప్పు కాఫీ లేదా టీ లేద సూప్ తాగాలనిపిస్తుంది.

కాబట్టి సహజసిద్దంగా జలుబు -దగ్గను పోగొట్టడానికి ఎన్నో మార్గాలున్నాయి. జింజర్ టీ చాలా పాపులర్. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ఎలా తీసుకొన్నా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి అల్లం ఉపయోగించి జలుబు, దగ్గకు తక్షణ ఉపశమనం పొందండి...
కావలసిన పదార్థాలు:
అల్లం పేస్ట్: 5tsp
నీళ్ళు: 2cups
తేనె: 1tbsp
నిమ్మరసం: 2tbsp
పెప్పర్(నల్ల మిరియాలు): 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో తగినన్ని నీళ్ళు పోసి బాగా కాగబెట్టాలి.
2. తర్వాత నీరు బాగా మరిగిన తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసి బాగా కలబెట్టాలి. వేడినీళ్ళలో బాగా కలిసిపోయిన తర్వాత మీడియ మంట మీద ఐదు నిముషాల పాటు బాగా ఉడికించాలి.
3. ఇప్పుడు అందులో నిమ్మరసం, తేనె, పెప్పర్ పౌడర్(మిరియాల పొడి) మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపి మరో రెండు నిముషాలు ఉడకించాలి.
4. అంతే వేడి వేడి జింజర్ సూప్ రెడీ. స్టౌ అఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని వేడి వేడి గా సర్వ్ చేస్తే.. జలుబు.. దగ్గు మాయం...
అల్లం-క్యారెట్ సూప్:
కావలసిన పదార్థాలు:
క్యారెట్స్: 5(పై పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: కొద్దిగా (చితగ్గొట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(పొట్టు తీసి కట్ చేసుకోవాలి)
వెజిటేబుల్ స్టాక్(క్యారెట్ రసం): 1cup
ఆరెంజ్ జ్యూస్ : 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
పెప్పర్: 2tsp
ఆలివ్ ఆయిల్: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడయ్యాకు అందులో ఉల్లిపాయ ముక్కలు, కచపచ దంచి పెట్టుకొన్న అల్లం వేసి రెండు నిముషాల పాటు తక్కువ మంట మీద వేయించాలి.
2. ఇప్పుడు అందులో వెజిటేబుల్ స్టాక్ వేసి తక్కువ మంట మీదా అరగంట పాటు చిక్కబడే వరకూ బాగా కాగనివ్వాలి.
3. చిక్కబడిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ కలిపి బాగా మిక్స్ చేయాలి. తర్వాత రెండు మూడు నిముషాలు ఉడికించాలి. తర్వాత దీన్ని బాగా కలపాలి లేదా మిక్సర్ లో బేసి మెత్తగా సూప్ లా తయారు చేసుకోవాలి.
4. దీన్ని సూప్ బౌల్లో వేసి కొద్దిగా ఉప్పు, పెప్పర్ పౌడర్ చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అల్లంతో తయారు చేసే ఈ రెండు
సూప్ లను శీతాకాలంలో తీసుకోవడం వల్ల జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు...



Click it and Unblock the Notifications