Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
హెల్తీ జింజర్ -కుకుంబర్ జ్యూస్: సమ్మర్ స్పెషల్
బయట ఎండలు మండుతున్నాయి. ఎండవేడికి శరీరంలో నీరంత చెమట రూపంలో బటయకు వచ్చేస్తుంది. దాంతో శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. దాంతో పాటు, చర్మ సమస్యలు, వడదెబ్బ, డయేరియా వంటి సమస్యలు అధికం అవుతాయి. వీటి బారీ నుండి మన శరీరాన్ని రక్షించుకోవాలంటే వేసవిలో చల్లచల్లగా ఏదైనా కూల్ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకుంటుండాలి.
వేసవిలో శరీరంలో నీటిని బ్యాలెన్స్ చేయడానికి కీరదోసకాయ బాగా సహాయపడుతుంది. డీహైడ్రేసన్ తగ్గిస్తుంది. వేసవికి జింజర్, కుకుంబర్ జ్యూస్ ఫర్ ఫెక్ట్ సమ్మర్ డ్రింక్ . మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అల్లంలో ఉండే మెడిసినల్ వాల్యూస్ అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్లో జ్యూస్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
కీరదోసకాయ: 1(సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: కొద్దిగా
పంచదార: 1tsp
జీలకర్ర పొడి 1/2tsp
బ్లాక్ సాల్ట్: 1/2tsp
నీళ్ళు: 1cup
తయారుచేయు విధానం:
1. ముందుగా అల్లం మరియు కీరదోసకాయకు పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. (మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి)
2. తర్వాత ఈ పేస్ట్ ను ఒక పెద్ద బౌల్లో పోసి మీకు అవసరం అయినన్ని నీళ్ళు కలుపుకోవచ్చు.
3. తర్వాత ఇందులో బ్లాక్ సాల్ట్, పంచదార మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే జ్యూస్ గ్లాసుల్లో పోసి, వెంటనే సర్వ్ చేయాలి. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ వేసవి తాపాని తీర్చుతుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది.



Click it and Unblock the Notifications