Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఇండియన్ స్టైల్ ఎస్ప్రెస్సో కాఫీ రెసిపీ
ఒక కప్పు వేడి వేడి కాఫీ, అదీ సువాసన భరింత మంచి ఫ్లేవర్ తో మనస్సును అలాగే మెస్మరైజ్ చేస్తుంది. ఇటువంటి కాఫీ అంటే అందరీ ఇష్టమే. ఒక కప్పు కాఫీతో మన మూడ్ ను రిఫ్రెష్ చేసుకోవడానికి ప్రతి రోజూ కాఫీ తాగుతుంటాం. కొందరేమో కాఫీ మంచిది కాదంటారు. మరికొందరేమో మంచిదంటారు ? మరి ఈ విషయాన్ని క్లియర్ చేసుకుందాం..కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది కాబట్టి, ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా తాగితే ఎటువంటి సమస్య ఉండదు.
కాఫీని కొంచెం డిఫరెంట్ గా తాగాలనిపించినప్పుడు, వివిధ ఫ్లేవర్స్ తో తయారు చేసి తాగడం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. మరి మీరు కూడా కాఫీ ప్రియులైతే ఇండియన్ టచ్ లో ఒక డిఫరెంట్ కాఫీ తాగాలనుకుంటే ఇండియన్ స్టైల్ ఎస్ప్రెస్సో కాఫీ రెసిపీ ప్రయత్నించండి. రుచి, వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
కాఫీ పౌడర్: 1tsp
పంచదార: 1tsp
పాలు: 1cup
నీళ్ళు: 1cup
చాక్లెట్ పౌడర్: చిటికెడు
తయారుచేయు విధానం:
1. ఒక కప్పులో, పంచదార, మరియు కాఫీ పౌడర్ వేయాలి. తర్వాత కొద్దిగా హాట్ వాటర్ వేసి బాగా గిలకొట్టాలి. గిలకొట్టడానికి కప్పుకు సరిపోయే స్పూన్ ఎంపిక చేసుకోవాలి. లేదా ఎలక్ట్రిక్ బీటర్ ను ఉపయోగించాలి.
2. బాగా గిలకొట్టిన తర్వాత కాఫీ బ్రౌన్ కాలర్ గా మరియు మెత్తగా కనబడుతుంది. అప్పుడు బీట్ చేయడం ఆపి, పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద డీప్ బాటర్ పాన్ పెట్టి పాలు పోసి, బాగా కాగనివ్వాలి. పాలు మరుగుతుండగా స్టౌ మీద నుండి తీసి కాఫీ కప్పులో పోయాలి.
4. అంతే కాఫీ చూడటానికి చాలా అందంగా.. నురగనురగ్గా ఉంటుంది.
5. అంతే కాఫీ మీద కొద్దిగా చాక్లెట్ పౌడర్ ను చిలకరించాలి. అంతే ఇండియన్ స్టైల్ ఎస్ప్రెస్సో కాఫీ రెసిపీ రెడీ. వేడి వేడిగా ఇంట్లో వారికి సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications