Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
కాజు హల్వా: బక్రీద్ స్పెషల్
ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ మైదటిదైతే..బక్రీద్ రెండవదిగా నిలిచింది. ముస్లింలు బక్రీద్‌ను ఖుర్భాని పండుగ అని కూడా అంటారు. బక్రీద్ పండుగ రోజు ముస్లిం పవిత్ర స్థలమైన మక్కాలో హజ్ యాత్ర జరుగుతుంది. ముస్లిం సోదరులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ పండుగ మైదటిదైతే..బక్రీద్ రెండవదిగా నిలిచింది. ఈద్‌గాలో నమాజు ముగుస్తుంది. అందరినీ చల్లగా చూడమని కోరే దువా ముగుస్తుంది. ఆ తర్వాత ఈద్ ముబారక్ చెప్పుకునే అలాయి బలాయి ముగుస్తుంది.
ఆ తర్వాత..? ఇంకేముంది... విందులూ వినోదాలే. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, అయినవాళ్లు... అందరూ కలిసి దావత్‌లో కూచుంటారు. మతాలు మర్చిపోయే క్షణాల్లో అందరూ ఆత్మీయులైపోతారు. మటన్, చికెన్, రోటీ, సేమ్యా, స్వీట్స్,... ఘుమఘుమలాడే పదార్థాల మధ్య మాటలు నంజుకుంటారు. నవ్వులు పంచుకుంటారు. పండుగలు ఉండాలి. ఒకరి పండుగలో మరొకరి లోగిలి కళకళలాడాలి. ఈ బహార్ కోసమే ఒక ప్రత్యేకమైన స్వీట్ రిసిపి మీకోసం...

కావల్సిన పదార్థాలు:
కాజు(జీడిపప్పు): 250grms(సన్నగా తరగాలి)
పాలు: 1ltr
పంచదార: 3-4tbsp
నెయ్యి లేదా బట్టర్: 2tbsp
కుంకుమపువ్వు:కొద్దిగా
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
2. అంతలోపు పాలను గిన్నెలో పోసి, తక్కువ మంట మీద వేడిచేసుకోవాలి.
3. పాలు మరిగి పొంగు రాగానే, అందులో పంచదార వేసి 2-3నిముషాలు బాగా మిక్స్ చేస్తూ మరిగించాలి. అంతలోపు చల్లారిన జీడిపప్పును మిక్సిలో వేసి మొత్తగా పౌడర్ చేసుకోవాలి.
4. తర్వాత అందులో కుంకుమ పువ్వు వేసి కొన్ని నిముషాలు బాగా మిక్స్ చేయడం వల్ల ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది.
5. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న జీడిపప్పు పౌడర్ ను అందలో వేసి, మరో 5 నిముషాలు నిధానంగా మిక్స్ చేస్తుండాలి.
6. తక్కువ మంట మీద పాలు-జీడిపప్పు మిశ్రమాన్ని బాగా ఉడికించడం వల్ల హల్వా చిక్కగా మారుతుంది. అంతే కాజు హల్వా రెడీ.



Click it and Unblock the Notifications