Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
కేసరి సందేష్ స్వీట్ ట్రీట్ -రక్షాబంధన్ స్పెషల్
రక్షాబందన్, ఈ పండుగను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొంటారు . ఈ రోజు మన భారతదేశం మొత్తం చాలా ఇష్టమైన పండుగగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రక్షాబంధన్ ప్రత్యేకత అక్క చెల్లెల్లు, వారి అన్నదమ్ములకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి, వారి ఆశీసులు, అభినందనలు తీసుకుంటారు. అంతే కాదండోయ్ వారే స్వయంగా తయారు చేసిన స్వీట్స్ ను వారి అన్నదమ్ములకు నోటిని తీపి చేయడం కూడా జరుగుతుంది. అందువల్లే రక్షబంధన్ సెలబ్రేషన్స్ కు స్వీట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది .
రాఖీ పండుగకు ఫర్ ఫెక్ట్ గా ఉండే స్వీట్ ఒక్కటి ఇక్కడ ఇస్తున్నాం. ఇది చాలా సాంప్రదాయకరమైన వంటకం మాత్రమే కాదు, రుచికరమైనది కూడా . మరి ఈ స్పెషల్ అకేషన్ కు మీరు ఈ స్వీట్ ను ట్రై చేసి చూడండి. కేసర్ అంటే కుంకుమపువ్వు, సందేష్ అంటే స్పెషల్ బెంగాలి స్వీట్ అని . దీన్ని పన్నీర్ తో తయారు చేస్తారు.మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి..

కావల్సిన పదార్థాలు:
కావల్సిన పదార్థాలు:
పూర్తిగా క్రీమ్ మిల్క్: 1ltr
నిమ్మరసం: 1tbsp
పంచదార పొడి: 4tbsp
పాల పొడి: 2tbsp
యాలకుల పొడి: 1tsp
కుంకుమపువ్వు: చిటికెడు(ఒక చెంచా పాలలో కుంకుమ పువ్వును నానబెట్టుకోవాలి)
డ్రై ఫ్రూట్స్: గార్నిషింగ్ కు సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మందపాటి పాత్రను స్టౌ మీద పెట్టి పాలను బాగా మరగ కాచాలి. బాగా కాగుతున్నప్పుడు అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి. నిమ్మరసం చేర్చిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి కొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.
2. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాని మీద ఒక పల్చటి కాటన్ వస్త్రాన్ని చుట్టి, కాగబెట్టుకొన్న, పాలను(నిమ్మరసం వేసిన తర్వాత పెరుగులా మారిన పాలను)పోసి వడగట్టుకోవాలి .
3. పాలు ఏ మాత్రం తేమలేకుండా వడిగిపోయేంతవరకూ మూట కట్టి టాప్ కు వేలాడదీసి, ఒక గంట పాటు అలాగే ఉంచాలి . దాంతో అదనపు తేమ అంతా పూర్తిగా తొలగిపోతుంది.

తయారు చేయు విధానం:
4. ఇప్పుడు దాన్ని పక్కకు తీసుకొని ఒక పాన్ లో వేసి, అందులో పంచదార, పాలపొడి, మరియు యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
5. మీ చేతి వేళ్ళను ఉపయోగించి బాగా కలగలుపుకోవాలి.
6. నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులో చన్న వేసి ఒక నిముషం వేడి చేసుకోవాలి. అలా చేయడం వల్ల అదనంగా ఏమైన ఉన్న తేమను పూర్తిగా డ్రై చేస్తుంది. దీన్ని కొన్ని నిముషాలు చల్లారనివ్వాలి.

తయారు చేయు విధానం:
7. ఇప్పుడు కొద్దిగా అరచేతిలోనికి తీసుకొని బాగా మాష్ చేసి చిన్న బాల్స్ లా చుట్టుకోవాలి తర్వాత కొద్దిగా కట్ లెట్ లేదా వడలా తట్టుకోవాలి .
8. మద్యలో కొద్దిగా గుంతగా ఉండేలే వత్తాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకోవాలి.
9. ఇప్పుడు వీటిపైన కుంకుమపువ్వు పాలను చిలకరించుకోవాలి.
10. దాని మీద డ్రై ఫ్రూట్స్ ను గార్నిష్ చేసుకోవాలి.

హ్యాపీ రక్షాబందన్!
హ్యాపీ రక్షాబందన్!
వీటిని అదే రోజు తినవచ్చు . లేదా గాలిచొరబడిన డబ్బాలో స్టోర్ చేసి, రిఫిజరేటర్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఒకటి రెండు రోజుల తర్వాత తినవచ్చు.



Click it and Unblock the Notifications