Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
నోరూరించే వేడి వేడి ఛాట్-మసాలా పూరి
వర్షాకాలం మొదలైంది నోటికి వేడి వేడిగా..కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగని అదేపనిగా బజ్జీ, బోండా, వడలు రోజూ తినలేం కదా..ఒక వేళ తిన్నా నూనె పదర్థాలు మన ఆరోగ్యాన్ని పాడు చేయడం ఖాయం. మరి ఇటువంటి సమయంలో సులభంగా తయారు చేసుకొనేవి, తేలికగా జీర్ణం అయ్యేవాటి మీద మనస్సు మళ్లించాలి. వర్షాకాలంలో చిరు జల్లులు పడుతున్న సమయంలో వేడి వేడి ఛాట్స్ నోరూరింస్తుంటాయి. మరియ ఇంటిల్లిపాది తినేటటువంటి ఆరోగ్యభరితమైన ఛాట్స్ మీకోసం..మీరు ఈ ఛాట్ తయారుచేసుకొని రుచి చూడండి...

కావలసిన పదార్థాలు
ఉడకబెట్టిన బఠాణీ గింజలు : రెండు కప్పులు
పచ్చిమిర్చి:3
వెజిటబుల్ ఆయిల్:ఒక టేబుల్‌స్పూన్
పచ్చికారం:ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా:ఒక టేబుల్ స్పూన్
ఛాట్ మసాలా:ఒక టేబుల్ స్పూన్
బ్లాక్, రాక్ సాల్ట్:అర టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి: అరటేబుల్ స్పూన్
మిరియాలపొడి:అర టేబుల్ స్పూన్
తీపి చింతపండు చట్నీ: రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు:అరకప్పు
ఉల్లిపాయ:ఒకటి (సన్నగా తరిగినది)
టమాటా: ఒకటి (చిన్నముక్కలుగా తరిగినది)
పూరీలు:పదిహేను
సన్నకారప్పూస:ఒక కప్పు
ఉప్పు:తగినంత
తయారు చేసే విధానం:
1. ఉడికించిన బఠానీలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానికి కొద్దిగా నీళ్లను చేర్చి జారుగా చేసుకోవాలి.
2. తర్వాత స్టౌవ్ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి దానిలో ఈ ముద్దను వేసి కొద్దిసేపు ఉడికించాలి. దీనికి పచ్చికారం, ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి, జీలకర్ర పొడి కలపాలి.
3. అన్నింటిని వేసి బాగా కలిపి ఐదునిమిషాలు ఉడికించాలి. కొద్దిగా జారుగా అవడానికి కావలసినంత నీటిని పోయండి.
4. దీనిని తినే ప్లేటులోకి తీసుకుని దీనిమీద వేయించిన పూరీలను ముక్కలుగా చేసి వేయాలి. దీనిపై చింతపండు చట్నీ, ఛాట్‌మసాలా, బ్లాక్ సాల్ట్, పెరుగు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, సన్నకారప్పూసతో సర్వ్ చేయండి. రుచి అమోఘంగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications