Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
హెల్తీ అండ్ న్యూట్రీషియన్ పెసరపప్పు మామిడి సలాడ్
వేసవి కాలం వస్తే చాలు, మామిడితో ఏదో ఒక కొత్త టేస్ట్ ను రుచి చూడాలనిపిస్తుంది. మామిడితో తయారు చేసే సలాడ్స్, ఊరగాయాలు, సాంబార్లు, లస్సీలు, జ్యూసులు ఇలా ఒకటేమిటి బోలెడు రుచులు వేసవి కాలం అంతా కమ్మగా నోటికి రుచిగా పుల్లగా అంధిస్తుంటాయి మామిడిపండ్లు.
అయితే పచ్చిమాడితో మాత్రం వేసవిలో పన్నా, సలాడ్స్ భలే రుచిగా ఉంటాయి. పచ్చిమామిడి పెసరపప్పు కాంబినేషన్ లో తాయరు చేసే సలాడ్ చాలా రుచికరంగా ఉంటుంది. అంతే కాదు ఆరోగ్యానికి చలువకూడా చేస్తుంది. ఇంకా ఇందులో కలర్ ఫుల్ గా కీరదోస ముక్కలు, క్యారెట్ తురుము, కొబ్బరి తురము, పచ్చిమిర్చి భలే రుచిగా ఉంటాయి. పూర్తి పోషకాంశాలు శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ పచ్చిమామిడి పెసరపప్పు సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
పెసరపప్పు: 1cup
వేరుశనగపప్పు (పల్లీలు): 1/2cup
మామిడికాయ తురుము: 2tbsp
పచ్చికొబ్బరి తురుము: 2tsp
కీరదోస ముక్కలు(లేదా తురుము): 2tbsp
క్యారెట్ తురుము: 2tbps
కొత్తిమీర తరుగు: కొద్దిగా
ఉప్పు: రుచికి తగినంత
పచ్చిమిర్చి: రెండు (సన్నగా తరగాలి)
ఎండుమిర్చి: 2
ఆవాలు: 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పెసరపప్పు, వేరుశనగపప్పులను విడివిడిగా మూడు నాలుగు గంటల సేపు నానబెట్టి నీళ్లు వడకట్టాలి.
2. తర్వాత ఒక గిన్నెలో ఈ పప్పులను, పచ్చిమామిడి తురుము, కొబ్బరి తురుము, కీర దోస, క్యారెట్ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని ఐదారు నిముషాలు నాననివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పోపు పెట్టుకోవాలి. అరచెంచా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఎండు మిర్చి వేసి చిటపటలాడాక దింపేసుకోవాలి.
4. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. (మామిడికాయ బదులు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు)అంతే మూంగ్ దాల్ మ్యాంగో సలాడ్ రెడీ. వేసవి కాలంలో శరీరంలోని వేడిని తగ్గించుకోవడానికి ఒది ఒక మంచి ఔషధం.



Click it and Unblock the Notifications