Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
‘బందరు లడ్డూ’ కాదు... ‘మోతిచర్ లడ్డూ’..!!

ఇప్పటి వరకు మీరు బందరు లడ్డూ, బెజవాడ లడ్డూ, తిరుపతి లడ్డూ ఇలా రకరకాల లడ్డూలను రుచి చూసుంటారు. అయితే ఈ రోజు మీరు రుచిచూడబోతున్న లడ్డూ పేరు 'మోతిచర్ లడ్డూ', మనసుదోచే భారతీయ తియ్యిని వంటకాల్లో స్థానం దక్కించుకున్న ఈ స్వీట్ వంటకాన్ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు...
తయారీకి కావల్సిన పదార్థాలు:
- శెనగపిండి 2 ' కప్పులు
- పాలు ' లీటరు
- యాలుకల పొడి ' టీస్పూన్
- నెయ్యి మూడు కప్పులు
- పిస్తా, బాదాం పప్పులు అలంకరణకు సరిపడా
పాకానికి:
- పంచదార 2 ' కప్పులు
- నీరు 3 ' కప్పులు
- నెయ్యి 3 కప్పులు
బూందీ తయారు చేసుకునే విధానం:
- బాండీలో పంచదారలో పాటు నీటిని వేసి పంచదార పాకంగా మారేంత వరకు ఉడికించండి. ఈ పాకంలో పాలను కలిపి పొంగు వచ్చిన తరువాత యాలుకల పొడిని కలపండి. ఇలా తయారుకాబడ్డ పాకాన్ని ఓ పక్కన పెట్టుకోండి.
- సిద్ధంగా ఉంచుకున్న శెనగపిండిలో, పాలను కలిపి ' మిశ్రమాన్ని బూందీ చేసుకునేంత జీగటగా కలుపుకోండి'. పాన్ లో నెయ్యిను పోసి వేడిచేసుకోండి వేడెక్కిన నేతిలో శెనగపిండి మిశ్రమాన్ని బూందీ రూపంలో జారవిడవండి. బంగారం రంగు వచ్చేంత వరకు బూందీ పలుకులను వేయించండి.
- తయారైన బూందీ పలుకుల్లో తయారుచేసి సిద్ధంగా ఉంచుకున్న పాకాన్ని కలపుకోండి. ఈ మిశ్రమంలో కొద్దిగా వేడినీటిని కలిపి లడ్డూలుగా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న లడ్డూలను చల్లబడిన తరవాత తింటే ఆ రుచే వేరు.. పండుగ సందర్భాల్లోనూ ఈ వంటకాన్ని తయారు చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టకోవచ్చు...



Click it and Unblock the Notifications