మునగాకు శెనగల వడలు

Munagaku Senaga Vadalu
కావలసినవి పదార్థాలు:
మునగాకు: 1 cup
నానబెట్టిన పెద్ద శనగలు: 1cup
ఉల్లితరుగు: 1cup
పచ్చిమిర్చి: 10
ఉప్పు: రుచికి తగినంత
జీలకర్ర: 1/2tsp
నూనె: వేయించడానికి సరిపడినంత
సన్నగా తరిగిన క్యాప్సికమ్: 1/2 cup
అల్లం: చిన్న ముక్క
లవంగం: 3

తయారు చేయు విధానము:
1. శనగలను ముందురోజు రాత్రి నానబెట్టాలి. తయారుచేసే ముందు అందులోని నీరంతా వంపేసి, ఆ శనగలు, పచ్చిమిర్చి, అల్లం, లవంగం, వెల్లిల్లి, ఉప్పు, మునగాకు... వీటన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
2. అందులో ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి బాగా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలి ఉంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగాక పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుకుని నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్ మీదకు తీయాలి. వీటిని వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Story first published: Friday, July 22, 2011, 14:36 [IST]
Desktop Bottom Promotion