Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
మష్రూమ్ బులెట్స్

మష్రూమ్: 250 గ్రాములు
బంగాళాదుంప: 2
పచ్చిమిరప: 6
కొత్తిమిర: ఒక కట్ట
నీరుల్లి: 2
వెల్లుల్లి: 2
చాట్ మసాలా: 1tbsp
కార్నఫ్లో: ఒక కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 500గ్రాములు
తయారు చేయు విధానం:
ముందుగా మష్రూమ్ (పుట్టగొడుగుల) ని శుభ్రంగా నీటిలో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నీరుల్లి, వెల్లుల్లి, కొత్తిమిర, పచ్చిమిరప కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకొవాలి. బంగాళాదుంపని శుభ్రంచేసి కొబ్బరి తురుముతో తురుముకొని పక్కన పెట్టాలి. అన్ని ఇలా సిద్ద చేసుకొన్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మష్రూమ్ ముక్కలను, కొత్తిమిర, నీరుల్లి, వెల్లుల్లి, పచ్చిమిరప ముక్కలన్నింటి బౌల్ లో వేసి దానికి కొద్దిగా కార్నఫ్లో పౌడర్ ను, చాట్ మసాల, ఉప్పు జతచేసి కొద్దిగా నీటితో ముద్దలా తయారుచేసి పెట్టుకోవాలి. తర్వాత నూనెను ఒక పాన్లో తీసుకొని వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వత ముద్దగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో నుండి కొద్ది కొద్దిగా తీసుకొని బులెట్ ఆకారంలో కార్నఫ్లోను జతచేస్తు చేతితో వత్తుకోవాలి. ఇలా తయారైన మష్రూమ్ బులెట్స్ ను కాగే నూనెలో వేసి రంగు మారే వరకూ వేయించి తీస్తే సరి మష్రూమ్ బులెట్స్ రెడీ. వేడి వేడి గా వండించండి చాలా రుచిగా వుంటాయి.



Click it and Unblock the Notifications