Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఆరెంజ్ మాంక్టైల్

రోజూ పరగడుపున ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే, మార్నింగ్ సిక్‌నెస్‌నుండి సులభంగా బయటపడవచ్చు. గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నారింజ తొక్కను పడేయకుండా... ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే... చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది. యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి. తరచూ జలుబు చేసేవారిలో రోగనిరోధక శక్తి పెంచగలదు.
కావల్సిన పదార్థాలు:
ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్: 1cup(3ఆరెంజ్)
లెమన్ సోడా((స్పైట్): 1/2cup
నీళ్ళు: 1/4cup
పంచదార: 1tsp
ఐస్ ముక్కలు: తగినన్ని
తయారు చేయు విధానం
1. ముందుగా మార్కెట్ నుండి తీసుకొచ్చిన ఆరెంజ్ పండ్లను బాగా నీళ్ళతో కడిగి శుభ్రం చేయాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచి తేమ ఆరిన తర్వాత వాటిని రెండు బాగాలుగా కట్ చేసుకోవాలి.
2. ఇప్పుడు వీటి నుండి జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ ను పిండుకొన్న తర్వాత టీ ఫిల్టర్ లో వడగట్టుకోవాలి.
3. తర్వాత నీళ్ళు, తగినంత పంచదార, సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ను అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి.
4. అరగంట తర్వాత జ్యూస్ ను బయటకు తీసి సర్వింగ్ గ్లాస్ లో పోసి అందులో తగినన్ని ఐస్ ముక్కలు కలుపుకొని, గ్లాస్ కు లెమన్ స్లైస్ అమర్చి సర్వ్ చేయాలి. అంతే ఆరెంజ్ మాక్టైల్ రెడీ...



Click it and Unblock the Notifications