లో ఫ్యాట్ - పన్నీర్‌ టిక్కా

Paneer Tikka
కావలసిన పదార్ధాలు:
పన్నీర్‌: 300grms
క్యాప్సికం: 2
ఉల్లిపాయలు:2
టమోటాలు: 2
వెనిగర్ లేదా పెరుగు: యాభై గ్రాములు
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర పొడి : 1tsp
కారం: 1tsp
తందూరీ మసాలా: 1tsp
చాట్‌ మసాలా : ఒక స్పూను
ఉప్పు: రుచికి తగినంత
కసూరి మేథి: 1tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌: 1tsp
నూనె: 1tbsp

తయారు చేయు విధానము:
1. ముందుగా పన్నీర్‌, క్యాప్సికం, ఉల్లిపాయలు మరియు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
2. తర్వాత ఒక బౌట్‌ తీసుకొని అందులో పెరుగు లేదా వెనిగర్ (బాగా గట్టిగా ఉండి, నీరు లేకుండా చూసుకోవాలి),
అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, చాట్‌ మసాలా, తందూరీ మసాలా, కారం, ఉప్పు మరియు కసూరి మేథి వేసుకోవాలి. అన్ని బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న, పన్నీర్‌, క్యాప్సికం, ఉల్లిపాయలు మరియు టమోటాలను వేసుకొని, మసాలా అంతా అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
4. తర్వాత ఆ బౌల్‌ని రెండు మూడు గంటలు పాటు ఫ్రిజ్‌ లో పెట్టు కోవాలి. ఇప్పుడు ఫ్రిజ్‌ లో నుండి బౌల్‌ తీసి అన్ని ముక్కలను పెనం మీద కాని, ఓవెన్‌ లో కాని, లేకపోతే కుంపటిలో కాని దోరగా కాల్చుకోవాలి. లేదా నూనెలో వేసి వేయించుకోవాలి.
5. తర్వాత ఒక పుల్ల కాని సన్నని ఊచ లాంటిది కాని తీసుకొని ఒక పనీర్‌ ముక్క, ఒక క్యాప్సికం ముక్క, ఒక ఉల్లిపాయ ముక్క, ఒక టమోటో ముక్క అలా ఒక దాని తరువాత ఒకటి ఊచకి గుచ్చి కుంపటి మీద పెట్టి కాల్చుకోవాలి. ఎంతో రుచిగా ఉండే పన్నీర్‌ టిక్కా రెడీ అయినట్టే.

Story first published: Wednesday, September 14, 2011, 16:48 [IST]
Desktop Bottom Promotion