Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
స్వీట్ సమోసా రిసిపి: రంజాన్ స్పెషల్
ప్రస్తుతం రంజాన్ మాసం. రంజాన్ మాసంలో ఎక్కువగా ఉపవాసం ఉంటారు కాబట్టి, ఇప్తార్ లో తీసుకొనే ఆహారపదార్థాలు హెల్తీగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. నిష్టగా ఉపవాసం ఉన్నప్పుడు, దీక్ష విరమించిన తర్వాత తీసుకొనే ఆహారాల్లో అన్ని రకాల ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్, ఇతర మినిరల్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు.
READ MORE: పాలక్ పకోడ: హెల్తీ ఈవెనింగ్ స్నాక్
ఒక్క మీల్స్ మాత్రమే కాదు, స్నాక్స్ విషయంలో కూడా అంతే, ఉపవాసంలో కోల్పోయిన క్యాలరీలు తిరిగి పొందడానికి స్నాక్ రిసిపిలు బాగా సహాయపడుతాయి. అలాంటి స్నాక్స్ లో స్వీట్ సమోసా ఒకటి. స్వీట్ సమోసా ఫ్రైడ్ స్నాక్స్, షర్బత్ తో తయారుచేస్తే మరింత టేస్ట్ గా ఉంటుంది. అలాంటి స్వీట్ సమోసా రిసిపి మీకోసం ఒకటి....

కావల్సిన పదార్థాలు:
మైదా - ½kg
బట్టర్- 3 tbsp
నెయ్యి- 300 gms
నువ్వులు - 1/3 tsp
కోవ- 250 gm
ద్రాక్ష - ½tsp
పంచదార- ½cup
కొబ్బరి తురుము- 1 cup
గసగసాలు- 2tbsp
వెనీలా ఎసెన్స్- ½tsp
ఉప్పు: రుచికి సరిపడా
READ MORE: ఆలూ సమోసా: మాన్ సూన్ స్నాక్ రిసిపి
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా , కొద్దిగా బటర్, మరియు నీళ్ళు పోసి పిండిని సాప్ట్ గా కలపాలి.
2. ఇలా కలిపిన పిండిని కొన్ని గంటల పాటు పక్కన పెట్టుకోవాలి .
3. అంతలోపు మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పంచదార, కోవా, తెల్ల నువ్వులు, గసగసాలు, కొన్ని చుక్కల వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకొని చపాతీలా వత్తుకోవాలి.
5. తర్వాత చపాతీల రుద్దిపెట్టుకొన్న వాటిలో మద్యలో ఈ స్వీట్ స్టఫ్ మిశ్రమాన్ని వేసి, మడత పెట్టి, అన్ని వైపులా అంచులను క్లోజ్ చేయాలి. .
6. ఇప్పుడు వీటిని కాగుతున్న నూనెలో వేసి, డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొవాలి.అంతే స్వీట్ సమోసా రెడీ. ఈ స్వీట్ సమోసాలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications