Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
స్పైసీ వెజిటబుల్ కబాబ్-క్యాప్సికమ్ గార్నిషింగ్

కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు: 2
పనీర్: 50grm
క్యాబేజీ: 2tbsp
కాలీఫ్లవర్: 1/4cup
క్యాప్సికమ్: 1
టమోటో: 1
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2
కొత్తమీర: 1కట్ట
మైదా: 1cup
ఉప్పు: రుచికి తగినంత
కారం: 1tsp
నూనె: వేయించడానికి సరిపడా
నెయ్యి: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. చల్లారక పొట్టు తీసి తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత కాలీప్లవర్ పువ్వులను విడదీసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. క్యాబేజీ, కొత్తిమీర, పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో కొంచెం నూనె వేసి స్టౌమీద పెట్టి వేడయ్యాక, అందులో క్యాబేజీ, కాలీఫ్లవర్ తురుము వేయాలి.
5. కాలీఫ్లవర్, క్యాబేజీ వేగిన తర్వాత పనీర్ తురుము, బంగాళదుంప, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు చేర్చి తక్కువ మంట మీద ఉంచాలి.
6. పై పదార్థాలన్ని మగ్గి మెత్తగా అయ్యాక స్టౌ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత ఈ కూరను చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు మైదా పిండిలో ఉప్పు, కారం, నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి గరిటె జారుగా కలుపుకోవాలి.
8. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి, వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకొన్ని ఉండల్ని మైదా మిశ్రమంలో ముంచి కాగే నూనెలో వేయాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లోని తీసుకవాలి.
9. ఇప్పుడు వీటికి ఉల్లిపాయను, టమోటోను, క్యాప్సికమ్ ను చక్రాలుగా కట్ చేసి గార్నిష్ చేసి పర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ కబాబ్ రెడీ.



Click it and Unblock the Notifications