స్వీట్ సఫ్రాన్ రైస్

Sweet Saffron Rice
కావలసిన పదార్థాలు:
ముప్పావు కప్పు బియ్యం: 1cup
అర టీస్పూను కుంకుమపువ్వు(సఫ్రాన్): 1tsp
రెండు టేబుల్ స్పూన్లు వేడి పాలు: 2tbsp
వెన్న: 50grms
చల్లటి పాలు: 1glass
యాలకలు: 4
దాల్చినచెక్క: 1
పంచదార: 4tbsp
మీగడ: 2tbsp
వాల్‌నట్ ముక్కలు: 2tbsp
ఎండు ద్రాక్ష: 1/2cup

తయారు చేయు విధానం:
1. ముందుగా పాలలో కుంకుమపువ్వు నానపెట్టాలి. బియ్యాన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించి వడకట్టాలి.
2. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో బటర్ వేసి కరిగించి ఉడికించిన బియ్యాన్ని యాలకలపొడి, దాల్చినచెక్కను వేసి మూడు నిముషాలపాటు వేగించాలి.
3. తర్వాత అందులోనే చల్లటిపాలలో పంచదార కలిపి పెట్టుకోవాలి. పాన్ మీద మూతపెట్టి బియ్యాన్ని తక్కువ సెగపైన ఉడికించాలి. ఇందులో మీగడ, కుంకుమపువ్వు కలిపిన పాలు కలపి, మూతపెట్టి సన్నటి సెగపైన ఒక నిమిషం పాటు ఉడికించి వడ్డించే గిన్నెలో తీసుకుని నట్స్, ఎండుద్రాక్షలు వేసి అలంకరించాలి. తియ్యతియ్యటి సఫ్రాన్ రైస్ రెడీ.

Story first published: Monday, April 30, 2012, 17:10 [IST]
Desktop Bottom Promotion