వెజిటేబుల్ పాస్తా సూప్...

Vegetable Pasta Soup
కావలసిన పదార్థాలు:
ఉడికించినపాస్తా: 1cup
క్యారెట్ ముక్కలు: 1/2cup
బీన్స్ ముక్కలు: 1/4 cup
ఉల్లితరుగు: 1/4cup
క్యాప్సికమ్ తరుగు: 1/4cup
ఉల్లికాడల తరుగు: 1/4cup
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1tsp

తయారు చేయు విధానం:
1. మొదటగా కూరగాయలన్నీ చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో వెన్న వేసి వేడయ్యాక అందులోకూరగాయ ముక్కలను వేసి వచ్చివాసన పోయేవరకూ వేయించాలి.
3. ఇప్పుడు కూరగాయలన్నీ వేగాక నాలుగు కప్పుల నీరు, పాస్టా, ఉప్పు మిరయాలపొడి వేసి మరిగించి దింపేయాలి. ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే వెజిటేబుల్ పాస్తా సూప్ రెడీ...

Story first published: Monday, February 13, 2012, 11:42 [IST]
Desktop Bottom Promotion