Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
రా మ్యాంగో- బనానా షర్బత్: సమ్మర్ స్పెషల్
ఎండలో కాసేపు అలా బయటికెళ్లి ఇంటికి రాగానే చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తోంది. ఇలాంటప్పుడే మనసు శీతలపానీయాలవైపు లాగుతూ ఉంటుంది. నిమ్మరసం, మజ్జిగ ఎప్పుడూ తాగేవే. కాస్త వెరైటీగా ఇంకేదైనా అనుకునే వారికోసం ఇంట్లోనే పండ్లు మరియు కూరగాయలతో తయారు చేసుకోవచ్చు.
వేసవిలో ఆకలి వేస్తున్నట్టుంటుంది, తినలేము. దప్పిక కలుగుతున్నట్లు అనిపిస్తుంది, తాగలేము. నీరసం.... నీ...రసం. కొంచెం రిఫ్రెష్ బటన్ నొక్కి మనసును, శరీరాన్ని జిల్ జిల్‌మనిపించేలా ఏదైనా తిని, తాగాలనిపిస్తుంది.
అటువంటి సమయంలో చల్ల..చల్లగా .. మీ నోటికి అందాలి ఆమ్ కా రస్నా. కాస్త వెరైటీగా మరింత ఎనర్జీని అందివ్వడానికి ఆ మ్యాంగ్ షర్బత్ లో అరిటి పండ్ల ముక్కలు జోడిస్తే, ఇది ఒంట్లో వేడిని చల్లబరిచి, తేలికగా అరిగిపోయే డ్రింక్. ట్రై చేయండి. టేస్ట్ చేయండి.

కావలసిన పదార్థాలు :
పచ్చి మామిడికాయ: 1
అరటిపండు : 1
పంచదార : 1/2cup
జీలకర్ర పొడి : 1/2 tsp
మిరియాల పొడి : 1/2 tsp
ఉప్పు: రుచికి తగినంత
తయారుచేయు విధానం :
1. ముందుగా అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా తురుము కోవచ్చు.
3. ఇప్పుడు ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. తర్వాత నీరు పోసి పల్చని జ్యూస్‌లా బ్లెండ్ చేయాలి.
5. దీన్ని గ్లాసులోకి వడపోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి.
6. ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది. డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications