Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
బరువు తగ్గించే సూపర్ బ్రేక్ ఫాస్ట్..సోయా -శనగపప్పు కట్లెట్ చేసుకోండిలా..
ప్రతిరోజూ ఉదయం ఏం తినాలి అనేది ప్రతి ఇంట్లో ఎదురయ్యే పెద్ద ప్రశ్న. రోజూ తినే ఇడ్లీ, దోశలకు భిన్నంగా ఏదైనా కొత్తగా, రుచిగా తినాలని అందరికీ ఉంటుంది. అందులోనూ మీరు ఆరోగ్య స్పృహ ఉన్నవారైతే, తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం కోసం వెతుకుతున్నట్లయితే సోయా - శనగపప్పు కట్లెట్ మీకు బెస్ట్ ఆప్షన్.
ఇది తయారు చేయడం ఎంత సులభమో, తినడానికి అంత రుచిగా ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పవచ్చు.

సోయా -శనగపప్పు కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మీల్ మేకర్
-శనగపప్పు
-నూనె
జీలకర్ర
-ధనియాలు
-ఇంగువ
-ఉప్పు
-కారం
-పసుపు
-మిరియాల పొడి
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-పుట్నాల పొడి
సోయా -శనగపప్పు కట్లెట్ తయారీ విధానం
ముందుగా ఒక కప్పు శనగపప్పు శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీటిలో నానబెట్టండి.
-మరోవైపు ఒకటిన్నర కప్పుల సోయా చంక్స్ (మీల్ మేకర్) 10-15 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టాలి. నానిన తర్వాత వాటిని చేత్తో గట్టిగా పిండి, నీటిని పూర్తిగా తీసేయండి. ఆ తర్వాత చల్లటి నీటిలో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి, నీళ్లు పిండేసిన సోయాను వేసి సన్నని మంటపై కరకరలాడేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో 2 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పును వేయండి. అందులో అర కప్పు నీళ్లు పోసి పప్పును ఉడికించండి. ఒక 5 నిమిషాల్లో నీరంతా ఇంకిపోయి, పప్పు చక్కగా ఉడుకుతుంది.
-ఉడికించిన శనగపప్పును పప్పుగుత్తితో తేలికగా కచ్చాపచ్చాగా మెదుపుకోండి. ఇప్పుడు ఈ పప్పులో అర టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ దంచిన ధనియాలు, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తాజా కొత్తిమీర ఆకులు, కాడలు వేసి బాగా కలపండి.
-వేయించి పెట్టుకున్న సోయాను కత్తితో సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని పప్పు మిశ్రమంలో కలపండి. ఈ మిశ్రమం అంతా కట్లెట్ లా ఒత్తుకోవడానికి వీలుగా అర కప్పు పుట్నాల పొడి కలపండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని బాగా పిసకండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని గుండ్రంగా కట్లెట్ ఆకారంలో ఒత్తి పక్కన పెట్టుకోండి.
-చివరిగా స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి చాలా తక్కువ నూనె వేయండి. కట్లెట్లను పాన్ మీద పెట్టి సన్నని మంటపై కాల్చండి. కట్లెట్లు ఎంత పలుచగా ఉంటే లోపల అంత బాగా ఉడికి కరకరలాడుతూ వస్తాయి. రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి మారే వరకు దోరగా వేయించండి.
-అంతే సోయా - శనగపప్పు కట్లెట్లు రెడీ. వీటిని నచ్చిన చట్నీతో తింటే రుచి అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
