Latest Updates
-
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే..
గుత్తి వంకాయతో మసాలా చేసి బోర్ కొడితే ఇలా కొత్తగా ట్రై చేయండి.. వదలకుండా తినేస్తారు.!
గుత్తి వంకాయ కూర అంటే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. పెళ్లిళ్లు, ఫంక్షన్ల స్పెషల్‌గానూ ఫేమస్ అయింది. గుత్తి వంకాయ లేకుండా ఏ ఫంక్షన్ కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా గుత్తి వంకాయతో పెట్టే మసాలా పూర్ణం.. తలచుకుంటూనే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరుతాయి. మరి ఈ స్పెషల్ కూరగాయతో ఎప్పుడూ పూర్ణం కాకుండా ఇలా కొత్తగా మసాలా ఫ్రై చేసి చూడండి. ముద్ద కూడా వదలకుండా తింటారు.

గుత్తి వంకాయ కేవలం రుచికరమైన వంటకంగానే కాకుండా ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పీచు పదార్థాలు, విటమిన్లు బి, సి, ఇ, కెతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లతో పాటు ఇందులో వాడే మసాలా దినుసులతో ప్రొటీన్లు పొందవచ్చు. గుత్తి వంకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు కూడా మితంగా ఉండటం డయాబెటిస్ ఉన్నవారు సైతం తినవచ్చు.
గుత్తి వంకాయ మసాలా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
గుత్తి వంకాయలు- 300 గ్రాములు
చింతపండు- నిమ్మకాయ సైజు
వేరుశనగ- రెండు టేబుల్ స్పూన్లు
శనగపప్పు- టేబుల్‌స్పూన్
మినప్పప్పు- టేబుల్ స్పూన్
ధనియాలు- టేబుల్ స్పూన్
ఎండు మిర్చి- 7 లేదా 8
నువ్వులు- టేబుల్ స్పూన్
వెల్లుల్లి- 7 లేదా 8
నూనె- 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర- టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర- కొద్దిగా
గుత్తి వంకాయ మసాలా ఫ్రై తయారీ విధానం
తాజా, లేత గుత్తి వంకాయలను కాడ తీసేసి ఒక్కొక్క దాన్ని ఆరు సమాన ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి ఈ ముక్కలను 10 నిమిషాల పాటు నాననివ్వాలి. చింతపండును కడిగి గుజ్జుగా అయ్యేందుకు నానబెట్టుకోవాలి.
గుత్తి వంకాయ మసాలా తయారీ విధానం
స్టవ్‌పైన పాన్ పెట్టి ముందుగా వేరుశనగ, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, వెల్లుల్లిని వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టుకుని వేడయ్యాక అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత గుత్తి వంకాయ ముక్కలను వేసి కలపాలి.
వంకాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. దీంతో ముక్కలు నూనెలో మంచిగా వేగుతాయి. తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలి.
వంకాయలు మగ్గి మెత్తగా అవుతున్నప్పుడు చింతపండు రసాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూతపెట్టి కాసేపు ఉడకనివ్వాలి. చింతపండు రసం వంకాయల్లోకి మగ్గి కూర గుజ్జుగా అయిన తర్వాత సిద్ధం చేసుకున్న మసాలా పౌడర్ వేసి కలపాలి.
వంకాయల్లోకి మసాలా పౌడర్ బాగా మగ్గేవరకు చిన్న మంటపైన ఉడకనివ్వాలి. వేపుడు దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి ఉప్పు సరిచూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన వంకాయ మసాలా ఫ్రై రెడీ..
గుత్తి వంకాయతో ఎప్పుడూ పూర్ణం చేసుకుని తినడం బోర్ కొట్టిన వారు ఇలా కొత్తగా ట్రై చేయొచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్‌గా వేపుడు రెడీ అవుతుంది. గుత్తి వంకాయ వేపుడుకి తోడుగా పప్పు, సాంబార్, రసం అద్భుతంగా ఉంటుంది. చపాతీలోకి సైతం ఈ కాంబినేషన్ బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
