Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఇడ్లీ, దోశ, పెసరట్టు,అన్నం దేనికైనా అదిరిపోయే అల్లం మామిడి పచ్చడి..ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు!
తెలుగువారి భోజనం పచ్చడి లేకుండా పూర్తికాదు. అందులోనూ మామిడికాయ పచ్చడి అంటే మనకు ఎక్కడలేని ఇష్టం. అయితే ఎప్పుడూ ఒకేలాంటి ఆవకాయ, మామిడి ముక్కల పచ్చడి తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త భిన్నంగా, నాలుకకు చురుక్కుమనే కారం, అబ్బా అనిపించే పులుపు, కమ్మటి తీపి.. ఈ మూడు రుచుల అద్భుత కలయికతో అల్లం మామిడికాయ పచ్చడి తయారు చేసుకోండి. వేడి వేడి అన్నంలో కాస్త కరిగించిన నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే.. ఆ రుచి అమృతంలా ఉంటుంది. ఇడ్లీ, దోశ, పెసరట్టు లాంటి టిఫిన్స్ లోకి కూడా ఇది అదిరిపోయే సైడ్ డిష్.

అల్లం మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
తాజా అల్లం: 1 కప్పు
పచ్చి పుల్లని మామిడికాయ: 2 కప్పులు
బెల్లం: 2 కప్పులు
కల్లు ఉప్పు: ముప్పావు కప్పు
పచ్చడి కారం: 1 కప్పు
అల్లం మామిడికాయ పచ్చడి తయారీ విధానం
-పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే తడి అస్సలు తగలకూడదు. ముందుగా అల్లం, మామిడికాయలను శుభ్రంగా నీటితో కడిగి, పొడి వస్త్రంతో తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత అల్లం పొట్టు, మామిడికాయ చెక్కు తీసి కొలతల ప్రకారం ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు శుభ్రమైన, తడిలేని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో అల్లం ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడుతున్నప్పుడే అల్లం ఘాటు, మామిడికాయ పులుపు కలిసి అద్భుతమైన సువాసన వస్తుంది. ఈ మిశ్రమంలో కల్లు ఉప్పు, పచ్చడి కారం వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఉప్పు, కారం ముక్కలకు బాగా పట్టిన తర్వాత చివరగా సన్నగా తురిమిన బెల్లం వేసి మెత్తని పేస్ట్ లా కాకుండా, కాస్త బరకగా రుబ్బుకోవాలి. బెల్లం కరిగేకొద్దీ పచ్చడికి చక్కటి గుజ్జు లాంటి ఆకృతి వస్తుంది.
-అంతే అల్లం మామిడికాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని అలాగే గాజు సీసాలో భద్రపరుచుకుని తినేయవచ్చు.
-మరింత రుచి కావాలనుకుంటే.. కొద్దిగా పల్లి నూనె లేదా నువ్వుల నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ వేసి దోరగా వేయించి పచ్చడిలో కలపాలి. ఆ పోపు వాసనకు ఎవరికైనా నోరూరాల్సిందే.
-ఇది కేవలం రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇందులో వాడిన అల్లం జీర్ణశక్తిని పెంచుతుంది. బెల్లం వల్ల ఐరన్ లభిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
