Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఆలూ కోకనట్ కర్రీ: టేస్టీ మీల్ డిష్
ఆలూ కోకనట్ కర్రీ చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్ రిసిపి, దీన్ని చాలా సులభంగా తయారుచేయవచ్చు. ఈ ఆలూ కోకనట్ యొక్క ప్రత్యేకత ఫ్రెష్ గా ఉన్న కొబ్బరి తురుము. కొబ్బరి తురము బంగాళదుంపలతో దీన్ని తయారుచేస్తారు.
ఆలూ వంటలంటే ఎక్కువగా ఇష్టపడే వారికోసం ఇలాంటి సింపుల్ వంటలు చాలా త్వరగా తయారుచేసుకొని, ఒక కొత్త రుచిని రుచి చూడవచ్చు. మరి మీరు కూడా ఈ వెరైటీ ఆలూ కోకనట్ కర్రీని టేస్ట్ చేయాలంటే ముందుగా ఈ డిష్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంప: 1/2kg
కొబ్బరి తురుము : 1cup
పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఆవాలు: 1tsp
ఎండుమిర్చి: రెండు
వెల్లుల్లి రేకులు: 5
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 2tbsp
పసుపు: చిటికెడు
కొత్తిమీర : కొద్దిగా
కరివేపాకు : రెండు రెమ్మలు
గరం మసాలా: 1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/2tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పై పొట్టు తొలగించి కావల్సిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడిఅయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసి మూత పెట్టాలి.
4. మద్యమద్యలో కలియబెడుతుంటే, బంగాళదుంప ముక్కలు నూనెలో మగ్గి మెత్తబడతాయి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి ఒక నిముషం ఆగి కొబ్బరి తురుము వేసి రెండు నిముషాలు కలపాలి.
5. కొబ్బరి తురుము, బంగాళదుంప ముక్కలు బాగా కలిసాక గరం మసాలా, కొత్తిమీర చల్లి మొత్తం మిశ్రామన్ని కలగలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఆలూ కోకనట్ కర్రీ రెడీ..



Click it and Unblock the Notifications