Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
ఘుమఘుమలాడే ఆలూ గోబి పులావ్ రిసిపి
ఆలూ గోబీ పులావ్ కంప్లీట్ గా మీల్ రిసిపి. దీన్ని బాస్మతి రైస్, కాలీఫ్లవర్, పొటాటో తో తయారు చేస్తారు. ఈ వంటకం వీకెండ్ లో తయారు చేసుకోవడానికి చాలా వెరైటీగా ఓ కొత్త టేస్ట్ ను అందిస్తుంది. గీ రైస్ వెజిటేబుల్స్ చేర్చడంతో వెరైటీ టేస్ట్ మీ సొంత అవుతుంది. ఘుమఘుమలాడే ఈ గీ రైస్ ను పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆలూ గోబీ పులావ్ రిసిపికి వెజిటేబుల్ తో తయారు చేసే రైతా చాలా టేస్టీగా ఉంటుంది.

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంప ముక్కలు: 3/4 cup (peeled)
కాలీఫ్లవర్ (విడుపించుకొన్నవి): 1 cup
బాస్మతి రైస్: 3 cups (soaked and drained)
నెయ్యి: 2tbsp
చెక్క: 1
లవంగాలు: 5
బిర్యానీ ఆకులు: 2
పసుపు: 1/2 tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఇప్పుడు, చెక్క, లవంగాలు మరియు బిర్యానీ ఆకు వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాల పాటు వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులోనే శుభ్రంచేసి కడిగి పెట్టుకొన్న బియ్యాన్ని వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే కాలీఫ్లవర్, బంగాళదుంప, బియ్యం, పసుపు, కారం, మరియు ఉప్పు, అన్నీ వేసి ఒక నిముషం పాటు వేగించాలి
4. అన్ని వేగిన తర్వాత అందులో మూడున్నర్ కప్పు నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేయాలి . ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పది నిముషాల అలాగే ఉంచి ఆ తర్వాత మూత తియ్యాలి. అంతే ఆలూ గోబీ పులావ్ రెడీ. దీన్ని వేడి వేడిగా వెజిటేబుల్ రైతాతో వడ్డించాలి.



Click it and Unblock the Notifications