Latest Updates
-
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం!
బెండీకా సాలన్: డెలిషియస్ వెజిటేరియన్ రిసిపి
బెండీ లేదా బెండకా వర్సిటైల్ వెజిటేబుల్. ఎందుకంటే వివిధ రకాల పదార్థాలతో ఈ బెండకాయను మనం వండుకోవచ్చు . కొన్ని ఫ్లేవర్ కలిగిన పదార్థాలను ఉపయోగించి చేస్తే, చాలా టేస్ట్ గా ఉంటుంది. బెండకాయను రుచికరంగా వండితే, పుల్కా లేదా రోటిలకు చాలా అద్భుత రుచి కలిగి ఉంటుంది.
సాలన్ రిసిపిలు హైదాబాద్ లో చాలా ప్రసిద్ది చెందినవి. సాధారణంగా దీన్ని పచ్చిమిర్చితో తయారుచేస్తుంటారు. సాలన్ కు ఉపయోగించే పదార్థాలనే ఇక్కడ మనం ఈ వంటకు ఉపయోగిస్తున్నాము. మరి మీరు కూడా ఈ వెజిటేరియన్ బేండీకా సాలన్ రిసిపిని రుచి చూడాలంటే, ఎలా తయారుచేయాలో తెలుసుకోవాల్సిందే...

కావల్సిన పదార్థాలు:
బెండకాయ(లేడీస్ ఫింగర్): 500grms
ఉల్లిపాయ: 1(పెద్దిది కట్ చేసుకోవాలి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం : 1tsp
పసుపు: 1/2tsp
ధనియాల పొడి : 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
కొత్తిమీర: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
తయారు చేయు విధానం:
1. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత పొడి టవల్ తో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి . వాటి చివర్లను కట్ చేసి, మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో బెండయాక ముక్కలు వేసి 5నిముషాలు వేయించి, తర్వాత ఒక ప్లేట్ లోనికి మార్చి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు, మరో టేబుల్ స్పూన్ నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 5నిముషాలు వేగించుకోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ కు మారగానే అందులో అల్లం,వెల్లుల్లి పేస్ట్ మరో రెండు నిముషాలు వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, వేసి మరో రెండు, మూడు నిముషాలు వేయించుకోవాలి.
6. తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసి, తర్వాత మిక్స్ చేయాలి.
7. అవసరం అయితే కొన్ని నీళ్ళు చిలకరించవచ్చు.
8. తక్కువ మంట పెట్టి, 10నిముషాలు బెండకాయను పూర్తిగా ఉడికించుకోవాలి.
9. ఒక సారి పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. ఈ రుచికరమైన బేండీ కా సాలన్ ను కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. ఈ బేండీకా సాలన్ ను రోటీ లేదా పుల్కాలతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications