Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బ్రింజాల్ గ్రీన్ పీస్ గ్రేవీ

కావలసిన పదార్ధాలు:
వంకాయలు: 1/2kg
పచ్చి బటానీలు: 1/2cup
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి:4-6
అల్లం: చిన్నముక్క
కరివేపాకు: రెండు రెమ్మలు
గరం మసాలాపొడి: 1tsp
కారం: 1tsp
ధనియాపొడి: 1tsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
కొత్తిమీర: కొద్దిగా
తాలింపుకు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి
తయారు చేసే విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేడిచేసి తాలింపు సిద్దం చేసుకోన్న ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించుకోవాలి.
2. తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
3. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసి వేగనివ్వాలి.
4. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకూ వేయించి తర్వాత సన్నగా కట్ చేసుకొన్న వంకాయ ముక్కలు, చిటికెడు పసుపు వేసి కలిపి మగ్గనివ్వాలి.
5. వంకాయ ముక్కలు వేగిన తరువాత, తగినంత ఉప్పు, కారం వేసి కలిపి ఉడికించిన బటానీలు కూడా వేసి వేయించాలి. చివరగా గరంమసాలాపొడి చల్లి రెండు నిముషాలు ఉంచి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే బ్రింజాల్ గ్రీన్ పీస్ గ్రేవీ రెడీ. ఇది వేడి వేడి అన్నం లేదా చపాతీ, రోటీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications