Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వంకాయ-పకోడీ కర్రీ

కావలసిన పదార్ధాలు:
వంకాయలు: 1/2kg
ఉల్లిపాయ: 1
కరివేపాకు: రెండు రెమ్మలు
అల్లం: చిన్న ముక్క
పచ్చిమిర్చి: 4
ఉప్పు: రుచికి తగినంత
కారం: కావలసినంత
పసుపు: 1/4tsp
గరంమసాలా పొడి: 1tsp
నూనె: తగినంత
తాలింపుకు: శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి
పకోడీలకు:
శనగపిండి: 1cup
వరి పిండి: 2tsp
ఉల్లిపాయ:
పచ్చిమిర్చి: 3
అల్లం: చిన్న ముక్క
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: ఒక కట్ట
ఉప్పు: రుచికి తగినంత
వంట సోడా: చిటికెడు
నూనె : సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడిఅయ్యాక అందులో శనగపప్పు. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి. అవి వేగాక కరివేపాకు వెయ్యాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి.
2. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన వంకాయముక్కలు వేసి, సన్నని సెగపై మూత పెట్టకుండా వేగనివ్వాలి. ముక్కలు కొంచెం మగ్గిన తరువాత పసుపు, అల్లం, మిర్చి కలిపి పేస్ట్ చేసుకన్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలిపి అదే తక్కువ మంట మీద వేగనివ్వాలి.
3. ముక్కలు బాగా వేగిన తరువాత తగినంత ఉప్పు, కారం, గరం మసాలా పొడి చల్లి బాగా కలపాలి.
4. ఈ లోగా పకోడీలకు కావలసిన అన్నింటిని కొంచెం నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి. మరో స్టౌ పై నూనె వేడిచేసి పకోడీలు వేసుకోవాలి. వంకాయముక్కలు వేగేలోగా అటు పకోడీలు కూడా రెడీ అయిపోతాయి.
5. తర్వాత వేగిన పకోడీలను సన్నగా తరిగి కూరలో కలిపి, రెండు నిమిషాలువేయించి, తరిగిన కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే వంకాయ పకోడీ కూర రెడీ అవుతుంది.



Click it and Unblock the Notifications