Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
క్యాబేజ్ కూటు-స్పెషల్ టేస్టీ సైడ్ డిష్
సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారంలో క్యాబేజీ ఒక ఆకుకూర. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయి.రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది. శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది
క్యాబేజీతో వివిధ రకాల వంటలు, వండుతారు. ఫ్రై, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్స్, సూప్స్ లోనూ రకరకాలుగా తింటుంటారు. అయితే కొంచెం వెరైటీగా ఓ స్పెషల్ సైడ్ డిష్ క్యాబేజ్ కూటును తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, పూరీలలోనికి చాలా రుచికరంగా ఉంటుంది. మరియు ఆరోగ్యానికి మంచిది కూడా...

కావల్సిన పదార్థాలు:
క్యాబేజ్: 1/2 (shredded)
పచ్చిశెనగపప్పు: 1/3 cup
పెసరపప్పు: 1/4 cup
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీరతరుగు: కొద్దిగా
పోపు వేయించడానికి :
ఆవాలు: 3/4 tsp
జీలకర్ర: 1 tsp.
ఉద్దిపప్పు: 1 tsp.
ఇంగువ: 1/4 tsp.
ఎండు మిర్చి: 2 (పెద్దవి)
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా
పేస్ట్ తయారు చేయడానికి కావల్సినవి:
కొబ్బరి తురుము: 3 tbsp.
పచ్చిమిర్చి: 3-4
జీలకర్ర: 1 tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిశెనగపప్పును 1గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట నానిన తర్వాత వాటిని కుక్కర్ లో వేసి, వాటితో పాటు క్యాబేజ్ తురుము, పసుపు, పెసరపప్పు వేసి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, అందులోనే ఉద్దిపప్పు, ఎండు మిర్చి వేసి లైట్ గా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, ఇంగువకూడా వేసి మిక్స్ వేయించాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టుకొన్న క్యాబేజ్ మిశ్రమాన్ని పోయాలి. అందులోనే ఉప్పు, కొబ్బరి పేస్ట్ ను వేసి మిక్స్ చేసుకోవాలి.
4. దీన్నంతటిని 5నిముషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడిగా, సైడ్ డిష్ గా సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. అంతే క్యాబేజ్ కూట్ రెడీ. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, పూరీలలోనికి చాలా రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications