Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
క్యారెట్ ఉల్లిపాయ దోసె

కావలసిన పదార్థాలు:-
మినపప్పు: 1cup
ఉప్పుడుబియ్యం/మామూలు బియ్యం : 2glass
కారట్ తురుము : 1cup
ఉల్లిపాయల తరుగు: 1cup
కొత్తిమీర తరుగు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం,మినప్పప్పు శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకొని, తగినంత ఉప్పు కలిపి దోసె పిండిని రాత్రంతా నానబెట్టుకోవాలి.
పిండి రాత్రంతా నాని వుంటే దోసెలు బాగా పొంగి రుచిగా వుంటాయి.(దోసె మెత్తగా బ్రౌన్ కలర్ రావాలనుకొంటే బియ్యం నానబెట్టేటప్పుడు అందులో ఒక చెంచా కందిపప్పు, అరచెంచా శెనగప్పు, కొద్దిగా మెంతులు వేసి నానబెట్టుకోవాలి)పిండి రుబ్బేటప్పుడు కొద్దిగా అన్నం కలుపుకొంటే దోసె మెత్తగా వస్తుంది.
2. మరుసటి రోజు ఉదయం పెనం వేడి చేసి కొంచెం నూనె వేసుకుని,దోసె వేసి ఇష్టమైన వాళ్ళు ఒక వైపు మాత్రమే దోసెను వేయించి రెండో వైపు, కారట్, ఉల్లిపాయలు,కొత్తిమీర, వేసి
మూతపెట్టి తక్కువ మంట మీద కుక్ చేసుకోవచ్చు.
3. కొందరికి రెండో వైపు కూడా అట్టు క్రిస్పీగా కావాలనుకుంటేరెండు వైపులా దోసెను కాల్చుకుని, ఒక వైపు ఇలా కారట, ఉల్లి, పచ్చిమిర్చి
కొత్తిమీర తరుగు వేసి ఉడికించుకోవచ్చు .. అంతే క్యారెట్ ఉల్లిపాయ దోసె రెడీ. ఈ దోసెలను పల్లీల చెట్నీ, కారప్పొడి లేదా కొబ్బరి చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications