Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
స్పైసీ చిల్లీ - కోరియాండర్ ఫ్రైడ్ రైస్
సాధారణంగా ఉద్యోగస్తులు-పిల్లలున్న ఇంట్లో అయితే, వారం అంతా కష్టం పడి, అలసిపోయినట్లు అనిపిస్తుంటే?అప్పుడు మీకు ఒక్కడ ఒక సులభమైన రెసిపి ఉంది. చిల్లీ కోరియాండర్ రిసిపి చాలా త్వరగా తయారయ్యే చైనీస్ వంటకం ఇది కొంచెం కారంగా, రుచికరంగా ఉంటుంది.ఈ స్పెషల్ రైస్ ఐటమ్ ను తింటుంటే ఉల్లాసకరంగా ఉంటుంది . సాధారణంగా చైనీస్ వంటలు తయారుచేయడం చాలా తేలిక మరియు చాలా సులభం. మరియు చైనీస్ వంటలంటే ప్రతి ఒక్కరీకి అమితమైన ఇష్టం. ఈ స్పైసీ చిల్లీ కోరియాండ్ రైస్ ఎప్పుడైనా తయారుచేసుకొనే ఒక ఉత్తమ రిసిపి.
చిల్లీ కోరియాండర్ రైస్ రిసిపి ని ఒక అద్భుత కాంబినేషన్ రెడ్ చిల్లీ మరియు గ్రీన్ చిల్లీ కాంబినేషన్ లో తయారుచేసుకుంటారు. మీరు కూడా స్పైసీ ఫుడ్ ప్రియులైతే, మీ డిన్నర్ కోసం ఒక ప్రత్యేకమైన వంటకం ఇది. దీన్ని ప్రయత్నించండి. మరియు ఇందులో సోయా సాస్ చేర్చడం వల్ల ఒక పుల్లని టేస్ట్ అందిస్తుంది. స్పైసీ మరియు ట్యాంగీ ఫ్లేవర్ తో ఒక అద్భుతమైన రుచిని అందిస్తూ..టేస్ట్ బడ్స్ ను మరింత ఊరిస్తుంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదర్థాలు:
బియ్యపు: 2cups
నీళ్ళు: 4 cups
వెల్లుల్లి: 6-7 రెబ్బలు(చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
ఎండు మిర్చి: 1 (మద్యకు తుంచి పెట్టుకోవాలి)
పచ్చిమిరపకాయలు: 4 (మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి)
సోయా సాస్: 1tbsp
కొత్తిమీర: 4tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి డీప్ బాటమ్ పాన్ లో వేసి, సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం వండిపెట్టుకోవాలి.
2. అన్నం తయారుచేసుకొన్న తర్వాత అన్నంను ఒక ప్లేట్ లోనిక మార్చుకొని చల్లార్చుకోవాలి.
3. అన్నం చల్లారేలోపు, పాన్ ను వేడి చేసి అందులో కట్ చేసి పెట్టుకొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిముషం మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. తర్వాత అందులో రెడ్ చిల్లీ మరియు గ్రీన్ చిల్లీ ముక్కులు వేసి మరో నిముషం వేగించుకోవాలి.
5. ఇప్పుడు అందులో సోయాసాస్, చల్లారబెట్టుకొన్ని అన్నం, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి, 5నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
6. ఒకసారి వేగించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడి గా సర్వ్ చేయాలి. అంతే స్పైసీ చిల్లీ -కోరియాండర్ రైస్ రెడీ. ఈ టేస్టీ రైస్ ను మీకు నచ్చిన సైడ్ డిష్ తో తింటూ ఎంజాయ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications