Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
చిల్లీ దహీ బెండీ ఫై రిసిపి : సమ్మర్ స్పెషల్
వేసవికాలంలో పెరుగును ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అవసరం. పెరుగులో వివిధ రకాల విటమిన్స్ ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది.
పెరుగును మీ రెగ్యులర్ వంటల్లో చేర్చడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంతే కాదు పెరుగులో కొద్దిగా నీళ్ళుపోసి తీసుకోవడం వల్ల క్యాలరీలను తగ్గించుకోవచ్చు.
ఈ రోజు అలాంటి ఒక హెల్తీ ఫుడ్ ను మీకు పరిచయం చేస్తున్నాము. ఇది చాలా సింపుల్ గా మరియు టేస్టీగా ఉంటుంది . చిల్లీ దహీ బెండీ డ్రై రిసిపి చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. ఈ దహీ బెండీ రిసిపి కిచిడి మరియు రోటిలకు మంచి కాంబినేషన్ . మరి ఈ టేస్టీ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు :
బెండకాయలు: 1/2kg
పెరుగు: 1cup
నూనె: 2tbsp
ఎండుమిర్చి: 2nos
ఆవాలు: 1tsp
పసుపు: 1/2tsp
పెప్పర్ పౌడర్ : 1/2tsp
టమోటో: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా బెండకాయను శుభ్రంగా కడిగి, పొడి కాటన్ వస్త్రంతో క్లీన్ గా తుడవాలి. 5 నిముషాల తర్వాత మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి వేసి తక్కువ మంట మీద ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు అందులో ఆవాలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి .
4. తర్వత అందులోనే పసుపు మరియు పెప్పర్ పౌడర్ కూడా వేసి, మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసిన టమోటో ముక్కలు కూడా వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. టమోటో మరియు ఉల్లిపాయ మెత్తగా వేగి నూనె పైకితేలుతున్నట్లు అనిపిస్తే అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న బెండకాయ ముక్కలు మరియు ఉప్పు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. మూత పెట్టి కొద్ది సమయం ఉడికిన తర్వాత, మూత తీసి అందులో పెరుగు వేసి మరో రెండు నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
8. అంతే చిల్లీ దహీ బెండీ డ్రై రెడీ.



Click it and Unblock the Notifications