Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
చిల్లీ గార్లిక్ న్యూడిల్స్
నూడిల్స్ ప్రతి ఒక్కరీకి ఇష్టమైనవే. అయితే కొంచెం స్పైసీగా తయారు చేసుకొంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చైనీస్ వంటకం ప్రపంచమంతటా అలా పాకిపోయింది. అందుకే రోజులో ఎప్పుడైనా సరే చిటికెలో తయారు చేసుకొని తినడానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు.
నూడిల్స్ ను వివిధ రకాల ఫ్లేవర్స్ తో తయారు చేస్తారు. అయితే ప్రతి ప్లేవర్ వంటకానికి కొన్ని విభిన్నమైన పదార్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. అందులో కొన్ని రకాల హెల్తీ వెజిటేబుల్స్ ను కూడా చేర్చవచ్చు. అతి త్వరగా తయారు చేసుకొని తినేసేయాలంటే ఈ చిల్లీ, గార్లిక్ నూడిల్స్ ను ప్రయత్నించవచ్చు. మంచి ఫ్లేవర్ తో పాటు, మంచి టేస్ట్ ను కూడా మీకు అందిస్తుంది.
కావల్సిన పదార్థాలు:
నూడిల్స్: 250 gms
ఉల్లిపాయలు: 2-3 (చిన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి: 2tbsp (కచపచ దంచుకోవాలి)
పచ్చిమిర్చి సాస్: 2tsp
శ్చెజ్వాన్ సాస్: 2tsp
ఎండు మిరపకాయలు: 1tsp
నూడిల్స్ మసాలా: 1tsp
నీళ్ళు: ఉడికించడానికి
ఉప్పు: రుచికి సరిపడా
చీజ్: 2tbsp(తురుముకోవాలి)
నూనె: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో నీళ్ళు పోసి మరిగించాలి. మూత పెడితే త్వరగా నీళ్ళు కాగుతాయి. నీళ్ళు మరిగే సమయం చూసుకొని అందులో నూడిల్స్ ను వేయాలి. అలాగే ఒక చెంచా నూనె, ఉప్పు వేసి ఉడికించాలి.
2. మధ్య మధ్యలో కలుపుతూ నూడిల్స్ ఉడికించాలి. నూడిల్స్ ను ఎక్కువ సేపు ఉడికించ కూడదు. ఉడికిన వెంటేనే నీటిని వంపేసు కోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో స్ప్రెడ్ చేసి చల్లారనివ్వాలి.
3. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కులు వేసి కొన్ని నిముషాల పాటు వేయించాలి.
4. కొద్దిగా ఉప్పు చిలకరించి అందులో శ్చెజ్వాన్ సాస్, వెల్లుల్లి, చిల్లీ సాస్, ఎండు మిర్చి మరియు ఉడికించిన నూడిల్స్ వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. పదార్థాల్నీ కలగలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో నూడిల్స్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. మరో నిముషా పాటు ఫ్రై చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఒక సర్వింగ్ బౌల్లోనికి గార్లిక్ నూడిల్స్ ను తీసుకొని చీజ్ తురుముతో గార్నిష్ చేసి, టమోటో కెచప్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications