Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
నోరూరించే కొబ్బరి చట్నీ
సౌత్ ఇండియన్ డిషెష్ లో చట్నీలు చాలా ఫేమస్. తప్పనిసరిగా సైడ్ డిష్ లలో చట్నీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా టిఫిన్స్ ఇడ్లీ, దోస, మరియు వడ వంటి వాటికి చట్నీలు తప్పని సరిగా ఉండాలి.
వివిధ రకాల చట్నీలను వివిధ రకాల పదార్థాలతో తయారుచేస్తారు. టమోటో, చింతపండు, కొబ్బరి, కొత్తిమీర, మరియు ఎండుమిర్చి మరియు మరికొన్ని ఇతర పదార్థాలతో చట్నీలను తయారుచేస్తారు. ఈ పదార్థాలను సౌత్ ఇండియన్ చట్నీలన్నింటిలో దాదాపు అన్నింటిలో ఉపయోగిస్తారు.
ఇక్కడ ఒక సింపుల్ కొబ్బరి చట్నీని అందివ్వడం జరిగింది. కాస్త వెరైటీగా ఉండటానికి ఈ చట్నీకి కొద్దిగా చిక్కటి పెరుగును చేర్చడం జరిగింది. ఈ చట్నీ రిసిపి దోస, ఇడ్లీ, రైస్ మరియు రోటీలకు మంచి కాంబినేషన్ మరి, ఈ చట్నీ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

ఫ్రెష్ గా తురుమిన కొబ్బరి : 1cup
పెరుగుం 2tbsp(బాగా గిలకొట్టాలి)
ఆవాలు: 1/2tsp
పచ్చిమిర్చి: 8
ఎండుమిర్చి: 2
ఉప్పు: రుచికి సరిపడా
ఉద్దిపప్పు: 1tsp
కోకనట్ మ్యాంగో చట్నీ : వెజిటేరియన్ వంటలు
నూనె: కొద్దిగా
నీళ్ళు: కొద్దిగా
కరివేపాకు : 2రెమ్మలు
కోకొనట్ - టమోటో చట్నీ రిసిపి
తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్స్ జార్లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, మరియు పెరుగు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి బ్లెడ్ చేయాలి . మెత్తగా పేస్ట్ చేయాలి . తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు వేసి ఒక నిముషం వేగించాలి.రుచికరమైన శెనగపప్పుకొబ్బరి చట్నీ
3. పోపు వేగిన తర్వాత అందులో మిక్సీలో తయారుచేసుకొన్న కర్డ్ కోకనట్ చట్నీ వేసి, మీడియం మంట మీద 5నిముషాలు మిక్స్ చేస్తూ ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి .
4. ఈ చట్నీని సర్వింగ్ బౌల్లో వేసి ఇడ్లీ, వడ లేదా దోస, ప్లెయిన్ రైస్ కు కాంబినేషన్ గా వడ్డించవచ్చు.



Click it and Unblock the Notifications