Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
దహీ (పెరుగు)అర్బి రిసిపి -నవరాత్రి స్పెషల్
నవరాత్రి స్పెషల్ గా ఇక్కడ ఒక స్పెషల్ రిసిపిని మీకు పరిచయం చేస్తున్నాం . నవరాత్రికి ఉపవాసదీక్షలు చేసే వారు , ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపవాసం ఉన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం.
దహీ అర్భి అటువంటి పోషకాహారం ఉన్న స్పెషల్ వంట. ఈ స్పెషల్ నవరాత్రి వంటను చాలా సులభంగా తయారుచేయవచ్చు మరియు ఉపవాస సమయంలో నిరభ్యరంతరంగా తీసుకోవచ్చు . అర్భి అనేది ఒక న్యూట్రీషియన్ వెజిటేబుల్. ఇది ఉపవాస సమయంలో మీకు పూర్తి శక్తిని అంధిస్తుంది. ఈ వంటను పెరుగుతో తయారుచేయడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది .

కావల్సిన పదార్థాలు:
అర్భి (కొలకాసియ): 250gms
చిక్కటి పెరుగు: 3cups
అజ్వైన్: 1tbsp
ధనియాల పొడి: 1tsp
కారం: 1tsp
పసుపు: 1tsp
డ్రై మ్యాంగో పౌడర్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
నీళ్ళు: 1cup
తయారుచేయాల్సిన విధానం :
1. బర్భిని శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్ లో వేసి మీడియం మంట మీద రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. ఒకసారి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి.
3. పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి, కావల్సిన సైజ్ లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ ల కొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో అజ్వైన్ వేయాలి.
5. మంట పూర్తిగా తగ్గించి, అందుల పసుపు, కారం, డ్రై మాంగో పౌడర్, ధనియాల పొడి వేసి రెండు, మూడు నిముషాలు వేగించుకోవాలి.
6. తర్వాత అందులో ఉడికించి కట్ చేసి పెట్టుకొన్న అర్బి ముక్కలను వేసి బాగా మిక్స్ చేయాలి, మిక్స్ చేస్తూ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. తర్వాత అందులో పెరుగును వేసి బాగా మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు ఈ మొత్తం గ్రేవీని ఉడికించుకోవాలి మరియు 10 నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి . పది నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అర్బి రిసిపి నవరాత్రి స్పెషల్ రెడీ. ఈ స్పెషల్ రిసిపిని కుట్టుక పరాఠ లేదా అన్నంతో సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications