Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఉల్లిపాయలేని రుచికరమైన దహీ పనీర్ రిసిపి
ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిపాయలు ఒక విలాసవంతమైన వస్తువుగా మారింది. ఉల్లిపాయను మనం ఇంతక ముందు ఉపయోగించినట్లు ప్రస్తుతం మనం వంటల్లో ఎక్కువ మోతాదులో ఉపయోగించుకోలేకపోతున్నాం. ఉల్లిపాయ రేటు ఆకాశంలో చుక్కల్నంటుతున్న ఈ సమయంలో సామన్య ప్రజానికం ఉల్లిపాయ లేకుండానే వంటలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
ఉల్లిపాయలేకుండా వంట ఎలా వండటం? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఉల్లిపాయ ఉపయోగించిన వంటకాలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. వెజిటేరియన్స్ అమితంగా ఇష్టపడే పనీర్ ను ఉల్లిపాయ లేకుండా గ్రేవీలా తయారు చేసుకోవచ్చు. మీరు పనీర్ ఫేవరెట్ అయితే ?ఉల్లిపాయలేని దహీపనీర్ ను ఒక సారి ట్రై చేయండి. ఈ వంటకాన్ని ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించకుండానే తయారు చేయవచ్చు . సాధరణంగా దహీపనీర్ ఒక ఇండియన్ రిసిపి. ఇది పెరుగు గ్రేవీని కలిగి ఉంటుంది. ఈ దహీ పనీర్ అంత కారంగా ఉండదు. ఎందుకంటే ఇందులో చిక్కటి పెరుగును ఉపయోగిస్తాం కాబట్టి. కారం లేకపోయినా చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ఒక సారి ట్రై చేసి చూడండి..

పనీర్: 200 గ్రాముల(cubed)
సోపు గింజలు: 1/2 tsp
జీలకర్ర: 1/2 tsp
ఆవాలు : 1 / 2 tsp
Kalounji: 1/2tsp
ఇంగువ లేదా హింగ్: 1చిటికెడు
పచ్చిమిరపకాయలు: 2 (మద్యలోకి కట్ చేయాలి)
కారం: 1/2 tsp
పసుపు: 1 tsp
పెరుగు: 2 cups(చిలికించి పెట్టుకోవాలి)
కొత్తిమీర: 2కాడలు(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర, సోంపు, ఆవాలు, కలౌంజీ మరియు చిటికెడు ఇంగువ వేసి ఫ్రై చేయాలి.
2. ఈ మసాలా దినుసులన్నీ చిటపటలాడుతూ వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలు కూడా వేసి, మీడియం మంట మీద 2-3నిముషాలు వేగించుకోవాలి.
3. తర్వాత ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కూడా వేసి మరో 2నిముషాలు వేగించుకోవాలి.
4. తర్వాత పసుపు మరియు కారం కూడా వేసి మరో నిముషం ఫ్రై చేయాలి.
5. ఇప్పుడు అందులోనే చిలికిన పెరుగును, వేసి వీటన్ని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఉప్పు వేసి మరో సారి మిక్స్ చేసి, మూత పెట్టి పది నిముషాలు ఉడికించుకోవాలి.
6. తర్వాత మీకు గ్రేవి అవసరం అనుకుంటే అరకప్పు నీళ్ళు మిక్స్ చేసుకోవచ్చు. నీళ్ళు మిక్స్ చేసిన తర్వాత మరో 3-4నిముషాలు ఉడికించుకోవాలి.
7. క్రిందికి దింపుకొనే ముందు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే దహీ పన్నీర్ కర్రీ రెడీ...అంతే ఈ దహీ పన్నీర్ రిసిపిని పులావ్ లేదా వేడి వేడి రోటీలతో సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications











