Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
దాల్ ఢోక్లి : గుజరాతీ స్పెషల్ దాల్ రిసిపి
దాల్ డోక్లి గుజరాతీ దాల్ రిసిపిలలో చాలా ఫేమస్ వంట. దీని గురించి చాలా మందికి తెలిసుండదు, డోక్లి వంట బేసిక్ గా ఇండియన్ వర్షన్ హోం మేడ్ పాస్తా వంటిది. దీన్ని గోధుమ పిండి ఉపయోగించి తయారుచేస్తారు. అయితే కొన్ని మసాలాలను ఉపయోగించి డోక్లిని తయారుచేస్తారు ‘డోక్లి'నా లేదా డోక్లా'అనే ఒక చిన్న పాటు కన్ఫ్యూజన్ మీకు కలగవచ్చు. డోక్లా అనేది ఆవిరి మీద ఉడికించిన గుజరాతి స్నాక్ రిసిపి
దాల్ డోక్లి రిసిపి రెండు భాగాలుగా విభజించి తయారుచేస్తారు. ముందుగా డోక్లి మందపాటి పీసులుగా తయారుచేసుకొని, తర్వాత స్పైసీ దాల్ తయారుచేసుకుంటారు. డోక్లిని ముందుగానే తయారుచేసుకొని ఫ్రిజ్ లో కూడా ఉంచుకోవచ్చు. మరి ఈ గుజరాతీ స్పెషల్ దాల్ డోక్లి ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి: 1cup
- పసుపు: 1/2tsp
- కారం: 1/2tsp
- ఉప్పు: రుచికి సరిపడా
- నూనె : తగినంత
- నీళ్ళు : 1cup
- దాల్ తయారుచేయడం కోసం:
- కందిపప్పు: 1cup
- ఉల్లిపాయలు: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
- పసుపు: 1tsp
- పంచదార: 2tsp
- గరం మసాలా: 1/2tsp
- డ్రై మ్యాంగో పౌడర్: 1tsp
- ఆవాలు: 1/2tsp
- జీలకర్ర: 1/2tsp
- లవంగాలు: 5
- ఎండు మిర్చి: 2
- కరివేపాకు: 8
- ఇంగువ: చిటికెడు
- నూనె: 1tbsp
- నీళ్ళు: 3cups
- కొత్తిమీర తరుగు: 1tbsp
తయారుచేయు విధానం:
1. డోక్లి కోసం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, కారం, మరియు నూనె వేసి, సరిపడా నీళ్ళు పోసి మృదువుగా కలిపి పెట్టుకోవాలి.
2.తర్వాత పిండిని నాలుగు లేదా 5 భాగాలుగా చేసుకొని రెక్టాంగిల్ షేప్ లో రోల్ చేసుకోవాలి(మందపాటి చపాతీల రుద్దుకోవాలి).
3. తర్వాత చాకుతో చిన్న రెక్టాంగిల్ సైజ్ (బిస్కెట్ సైజ్)లో కట్ చేసుకోవాలి. ఇలా కంట్ చేసుకొన్న డోక్లిని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు కందిపప్పును శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్ లో వేసి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు మరియు పసుపు వేసి, సరిపడా నీళ్ళు పసి మీడియం మంట మీద 5విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
5. పప్పు ఉడికిన తర్వాత స్టౌ మీద మరో పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, లవంగాలు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
6. పోపు వేగేలోపు, ప్రెజర్ కుక్కర్ లో ఉడికించుకొన్న పప్పు చల్లబడుతుంది. చల్లబడ్డ పప్పును పోపులో పోసి, బాగా మిక్స్ చేయాలి.
7. మిక్స్ చేసిన తర్వాత అందులో పంచడార, గరం మసాలా, డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి .
8. ఇప్పుడు డోక్లి పీసులను ఉడుకుతున్న దాల్ ల్లో వేయాలి.
9. డోక్లి వేసిన తర్వాత 5నిముషాలు మీడియం మంట మీద నిధానంగా ఉడికించుకోవాలి.
10. మొత్తం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి అంతే గుజరాతీ స్పెషల్ దాల్ ఢోక్లి రెడీ...



Click it and Unblock the Notifications