Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆలూ క్యాప్సికమ్ కర్రీ రిసిపి: స్టెప్ బై స్టెప్
శీతాకాలం ప్రారంభమైనది మార్కెట్లో ఎక్కడ చూసిన రుచికరమైన వెజిటేబుల్స్ తో కలర్ ఫుల్ గా కనబడుతున్నాయి. ఈ వెజిటేబుల్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా వాటిలో క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిబఠానీలు, బీట్ రూట్, కాలీఫ్లవర్, క్యాబేజ్ మరియు మరికొన్ని ఇతర ఆహారాలు . ఇవి చూడటానికి కలర్ ఫుల్ గా కనబడుట మాత్రమేకాదు, అంతే కలర్ ఫుల్ గా మనకు అవసరం అయ్యే పోషక విలువలను అందిస్తాయి .
శీతకాలంలో ఎక్కువగా అందుబాటులో ఉంటూ రుచికి రుచి పోషకాలను అందించే ఒక డెలిషియస్ వెజిటేబుల్ క్యాప్సికమ్ . వీటితో వివిధ రకాల వంటలను, ఫ్రై, సలాడ్స్ ను తయారుచేయవచ్చు . కొన్ని రకాల వెజిటేబుల్స్ మరియు ఇండియన్ మసాలా దినుసులు ఉపయోగించి వంటలు చేయడం వల్ల అద్భుతంగా ఒక కొత్త రుచులను అందిస్తాయి. ఇవే వెజిటేబుల్స్ ఉపయోగించి చైనీస్ సాస్ లేదా థాయ్ కర్రీలను కూడా తయారుచేయవచ్చు. ఎలా చూసిన క్యాప్సికమ్ టేస్ట్ మాత్రం అమేజింగ్ గా ఉంటుంది.

ఈ రోజు మీకోసం ఒక సింపుల్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. క్యాప్సికమ్ కర్రీ . దీన్ని కేవలం ఆరు స్టెప్పుల్లో తయారుచేసేయవచ్చు! మరి దీన్ని మన ఇండియన్ స్టైల్లో మనకు నచ్చిన విధంగా ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంప: 4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్: 3 (సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటాలు 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 1tsp
జీలకర్ర పొడి: 2 tsp
గరం మసాలా పొడి: 1tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర : 2tbsp(గార్నిష్ కోసం సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నూనె : 2 tbsp
నీరు: 1cup

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనెవేసి వేడయ్యాక అందులో జీలకర్ర మరియు వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిముషం వేగించి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి.
2. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి మారగానే అందులో పసుపు, కారం, జీలకర్రపొడి, బంగాళదుంప మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసి మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే టమోటో ముక్కలు మరియు కొద్దిగా ఉప్పు వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

4. ఇవన్నీ వేగిన తర్వాత సరిపడా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 5-6నిముషాలు మంటను మీడియంగా పెట్టి , మూత పెట్టి ఉడికించాలి.
5. 5నుండి 10 నిముషాలు ఉడికిన తర్వాత ప్లేట్ తీసి కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికినవో లేదో నిర్ధారించుకొన్న తర్వాత గరం మసాలా చిలకరించాలి.
6. అంతే రెండు మూడు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి .
ఈ రుచికరమైన ఆలూ క్యాప్సికమ్ రిసిపి సర్వ్ చేయడానికి రెడీ. ఈ వెజిటేరియన్ ట్రీట్ రోటీ మరియు పరోటాలకు మంచి కాంబినేషన్ .

పోషక విలువలు:
ఆలూ క్యాప్సికమ్ కర్రీ లో విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉన్నాయి . వీటిలో చాలా తక్కవు ఫ్యాట్ మరియు తక్కవు క్యాలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది డైటర్ కోసం చాలా మంచి ఆహారం.
కుక్కింగ్ టిప్స్:
ఉల్లిపాయలు వేగే టప్పుడు కొద్దిగా ఉప్పు చిలకరించడం వల్ల, ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి.
ఈ కర్రీకి మీకు నచ్చిన మరిన్ని వెజిటేబుల్స్ జోడించి మరింత న్యూట్రీషియన్ విలువలు పొందవచ్చు.



Click it and Unblock the Notifications











