Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
డాబా స్టైల్ హండి పన్నీర్ : నోరూరించే రుచి
సాధారణంగా, ఇంటి వంటలకు, రెస్టారెంట్ వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే రెస్టారెంట్స్ కు డాబా స్టైల్ వంటకు చాలా తేడా ఉంటుంది. డాబా స్టైల్ వంటలు చాలా సింపుల్ గా ఉంటాయి. అదే విధంగా చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి. ముఖ్యంగా స్పైసీ దాల్ తడ్కా , వివిధ రకాల పనీర్ కర్రీలు, వేడీ వేడి రోటీలకు తందూరి వంటలు చాలా టేస్ట్ గా ఉంటాయి.

డాబా స్టైల్ వంటలు చాలా రిచ్ గా మరియు స్పైసీగా ఉంటాయి. హందీపనీర్ కూడా అటువంటి డిష్ లో ఒక రుచికరమైన వంట. పనీర్ ను పెరుగు గ్రేవీలో ఉడికించి చిక్కటి గ్రేవీలా తయారుచేస్తారు. తర్వాత దీన్నిహంది(మట్టి కుండ)లోకి మార్చి, కొత్తమిరతరుగుతో గార్నిష్ చేస్తారు. దీన్నే హండి పన్నీర్ అంటారు. మరి ఈ స్పెషల్ డిష్ ను మీరు కూడా టేస్ట్ చూడాలంటే తయారుచేసే పద్దతిని తెలుసుకోవాల్సిందే...
కావల్సిన పదార్థాలు:
పనీర్: 200gms (క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి)
పెరుగు: ½cup (బాగా చిలకాలి)
ఉల్లిపాయ: 1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటోలు: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి 3 (తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పసుపు: 1tsp
ధనియాల పొడి: 1tsp
మిరియాల పొడి : 1tsp
కారం: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
బే ఆకు 1
నూనె: 2tbsp
నీరు: 1cup
ఉప్పు : రుచికి సరిపడా
ఫ్రెష్ క్రీమ్: 1tbsp
కొత్తిమీర తరుగు: 2tsp (తరిగిన)
మట్టి కుండ : 1 (మీడియం సైజ్)
తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి పన్నీర్ క్యూబ్స్ ను రెండు మూడే నిముషాలు వేయించుకోవాలి . అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద వేయిచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
4. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి వేసి మరో రెండు నిముషాలు వేయించుకోవాలి.
5. తర్వాత టమోటో, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ మరియు గరం మసాలా ఒకదాని తర్వాత ఒకటి జోడించాలి. జోడిస్తూ మీడియం మంట మీద వేయించుకోవాలి.
6. ఇప్పుడు అందులో చిలికి పెట్టుకొన్నపెరుగు వేసి బాగా మిక్స్ చేసి తక్కువ మంట మీద 5నిముషాలు ఉడికించుకోవాలి.
7. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఈ మొత్తం మిశ్రమాన్ని మట్టి కుండలోనికి మార్చుకోవాలి.
8. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి అంతే రుచికరమైన డాబా స్టైల్ హందీపన్నీర్ డిష్ రెడీ. రోటీ, కుల్చాకు సూపర్ టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications











