Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
భగభగ మండుతున్న సూర్యుడు.. బయట అడుగుపెట్టాలంటేనే భయపడేలా 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి ప్రాణాంతకమైన ఎండల్లో మన ఆరోగ్యం పట్ల ఏమాత్రం అశ్రద్ధ వహించినా తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా ఈ మండుటెండల్లో అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీలో రాళ్లు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్య బారిన పడుతున్నారని డాక్టర్లు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

కొందరిలో ఈ రాళ్లు మూత్రం ద్వారా సహజంగానే బయటకు వచ్చేస్తున్నప్పటికీ.. మరికొందరిలో మాత్రం ఇవి భరించలేని నొప్పికి కారణమవుతూ, చివరికి ఆపరేషన్ చేసేంత ప్రమాదకర స్థాయికి దారితీస్తున్నాయి. అసలు వేసవిలోనే ఈ కిడ్నీ రాళ్ల సమస్య ఎందుకు విజృంభిస్తుంది? దీని బారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇక్కడ చూడండి.
వేసవిలోనే కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
మండుతున్న ఎండల కారణంగా మన శరీరం తనను తాను చల్లబరుచుకునే క్రమంలో అధికంగా చెమటను బయటకు పంపుతుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం అమాంతం పడిపోయి డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. శరీరంలో తగినంత నీరు లేనప్పుడు, మూత్రపిండాల్లోని వ్యర్థాలు, ఖనిజాలు గట్టిపడిపోయి క్రమంగా అవి రాళ్లుగా మారతాయి. ఒకవేళ ఇప్పటికే కిడ్నీలో చిన్న రాళ్లు ఉన్నట్లయితే.. ఈ డీహైడ్రేషన్ వల్ల వాటి పరిమాణం వేగంగా పెరిగి, ప్రాణాంతకమైన నొప్పి వస్తుంది.
కిడ్నీ రాళ్లకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు
తగినంత నీరు తాడం
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే బ్రహ్మాస్త్రం లాంటి ఒకే ఒక్క మెడిసిన్ నీరు. ఈ వేసవిలో ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తప్పకుండా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగై, శరీరంలోని వ్యర్థాలు, మలినాలు మూత్రం ద్వారా సులభంగా బయటకు వెళ్లిపోతాయి.

మూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోవద్దు
ప్రయాణాల్లో ఉన్నప్పుడో, లేక పని ఒత్తిడిలో ఉన్నప్పుడో చాలా మంది గంటల తరబడి మూత్రాన్ని ఆపుకుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఇలా చేయడం వల్ల మూత్రంలో ఉండే రసాయనాలు కిడ్నీలో పేరుకుపోయి రాళ్లుగా మారతాయి. ఇది తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. కాబట్టి మూత్రవిసర్జనను ఎప్పుడూ వాయిదా వేయకండి.
జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ కు దూరంగా
ఎండల్లో దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్, సోడాలు తాగడం చాలా మందికి ఇష్టం. కానీ వీటిలో ఉండే అధిక చక్కెర, రసాయనాలు కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు
కేవలం నీళ్లు తాగడమే కాకుండా, నీటి శాతం పుష్కలంగా ఉండే పుచ్చకాయ, కర్బూజ, కీరదోస, నారింజ, ద్రాక్ష వంటి పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి సహజ పానీయాలు తాగడం వల్ల శరీరం చల్లగా ఉండటమే కాకుండా డీహైడ్రేషన్ దరిచేరదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
