Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ధనియా రైస్

స్పైసీగా లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది
కావలసిన పదార్థాలు:
నూనె: 1tbsp
ఎండు మిర్చి: 4-6
ఆవాలు: 1tsp
మినుములు: 1tsp
జీడిపప్పు: 10
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
టమోటో: 1(చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
పసుపు: చిటికెడు
అన్నం: 1cup
స్పైసీ పౌడర్ కోసం కావలసిన పదార్థాలు:
ధనియాలు: 2tbsp
ఎండు మిర్చి: 4-6
శెనగపప్పు: 1tbsp
మినుములు(ఉద్దిపప్పు): 1tsp
ఎండు కొబ్బరి తురుము: 1tbsp
గరం మసాలా: చెక్క: చిన్న ముక్క, లవంగాలు: 3, మిరియాలు: 4
తయారు చేయు విధానం:
1. ముందుగా స్పైసీ పౌడర్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలంటిని విడివిడిగా దోరగా వేయించుకొని మిక్సీలో వేసి రఫ్ గా పొడి చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత అందులో ఉద్దిపప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి.
3. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి, తర్వాత టమోటో ముక్కలను వేసి ఐదునిమిషాల పాటు వేగనివ్వాలి.
4. ఇప్పుడు అందులో మొదట తయారు చేసి పెట్టుకొన్న స్పైసీ పౌడర్ ను వేసి బాగా కలపాలి, వెంటనే అందులో పసుపు, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి.
5. తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నంను వేసి బాగా కలపాలి. అంతే ధనియా రైస్ రెడీ.



Click it and Unblock the Notifications