Latest Updates
-
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు!
దమ్ ఆలూ - పంజాబీ స్పెషల్ రిసిపి
ఇండియన్ వంటల్లో బాగా ప్రసిద్ది చెందిన వంటకాల్లో ఈ ఆలూ దమ్ కూడా ఒకటి. ఈ ఆలూ దమ్ ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా తయారు చేస్తుంటారు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ లో పోస్టో ఉపయోగించి గ్రేవి చిక్కగా తయారు చేసి ఆలూ దమ్ చేస్తారు. దమ్ ఆలూ పంజాబీయుల స్పెషల్ రిసిపి. చాల రుచికరంగా ఉంటే.
అదే సౌత్ లో గ్రేవీకి కొబ్బరి తురుము ఉపయోగించి తయారు చేస్తారు. ఇక రెస్టారెంట్లలో ఐతే ఇండియన్ మసాలా ధినుసులు, కొబ్బరి తురుము, టమోటో కెచప్ తో ఘాటుగా తయారు చేస్తారు. చాలా మంది ఇంట్లో తయారు చేసేటప్పుడు, టమోటో కెచప్ కు బదులు, టమోటో గుజ్జును ఉపయోగిస్తారు. టమోటో కెచప్ చేర్చడం వల్ల కొద్దిగా తియ్యగా.. ఇండియన్ మసాలలు చేర్చడం వల్ల కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్ రోటీకు చాలా ఫర్ఫెక్ట్ కాంబినేషన్..మరి ఆలూ దమ్ ఎలా తయారు చేస్తారా చూద్దాం రండి....

కావల్సిన పదార్థాలు:
చిన్న బంగాళ దుంపలు: 15(ఉప్పునీరు లో ఉడకబెట్టుకోవాలి)
పెద్ద ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
చిక్కటి పెరుగు: 3/4 cup
బిర్యానీ ఆకు: 1
ఇంగువ: ఒక చిటికెడు
కారం: 1 tsp
పసుపు: 1/4 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbps
ధనియాలు: 1tbsp
జీలకర్ర: 1/2 tsp
గ్రీన్ ఏలకుల: 1
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4
జీడిపప్పు: 8-10
కసూరి మెంతి (ఎండిన మెంతులు ఆకులు): 1/2 tbsp
చక్కెర: 1tsp(అవసరం అయితేనే)
నూనె: 5tbsp
కొత్తిమీర: 2tbsp(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉడికంచి పెట్టుకొన్న బంగాళదుంపల్ని పొట్టుతీసి పోర్క్ తో గుచ్చి..గుచ్చి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో రెండు చెంచాల నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంపలను వేసి, మీడియం మంట మీద, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేగించుకొని వేరే ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు మిక్సీలో ధనియాలు, జీలకర్ర, యాలకలు, చెక్క, లవంగాలు మరియు జీడిపప్పు వేసి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత కడాయ్ తీసుకొని అందులో మిగిలిన3టేబుల్ స్పూన్ల నూనె వేసి , వేడయ్యాక అందులో చిటెకెడు ఇంగువ వేసి నాలుగైదు సెకన్లు వేగించాలి. తర్వాత అందులోనే బిర్యానీ ఆకు మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించుకోవాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మరో 30సెకన్లు వేగించాలి.
5. ఇప్పుడు అందులో మిక్సీలో పొడి చేసుకొన్న జీడిపప్పు మిశ్రమాన్ని అందులో వేసి ఒక నిముషం వేగనివ్వాలి.
6. తర్వాత పెరుగును బాగా గిలకొట్టి వేగుతున్న మిశ్రమంలో నిదానంగా కలపాలి. అలాగే ఒకనిముషం తర్వాత పసుపు, కారం కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
7. ఈ మిశ్రమాన్నంతటిని తక్కువ మంట మీద వేగించడం వల్ల నూనె పైకి తేలుతుంది(మసాలా మరియు నూనె సపరేట్ అవుతుంది).
8. ఇప్పుడు అందులో వేగించి పెట్టుకొన్న బంగాల దుంపలను, కస్తూరీ మేతి, పంచదరా మరియు ఉప్పు వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
9. కొద్దిసేపు ఎక్కువ మంట మీద బాగా ఉడికించి 5నిముషాల తర్వాత మంట పూర్తిగా తగ్గించి గ్రేవీ చిక్కబడేవరకూ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వతా స్టౌ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోనికి మార్చుకోవాలి.
10. అంతే పంజాబీ దమ్ ఆలూ రెడీ. దీన్ని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని, వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications