Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఈజీ సేమియా ఉప్మా: టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి
బ్రేక్ ఫాస్ట్ లో చాలా వెరైటీలు ఉన్నాయి. అన్నింటిలోకి చాలా సులభంగా త్వరగా అయ్యే అల్పాహారం. సేమియా వంటకం. ఇటు స్వీటు కానీ..అటు హాట్ కానీ ఎదైనా సరై అతి త్వరగా తయారయ్యే వంటకం సేమియా వంటకం. సేమియాతో రకరకాల రుచిలు చేస్తుంటా. సేమియా పాయసం, సేమియా చాట్, సేమియా ఉప్మా ...చాలా రకాలే ఉన్నాయి. అయితే చాలా త్వరగా అయిపోయే టేస్టీ టిఫిన్ సేమ్యా ఉప్మా.
ఉప్మాలో వెరైటీ ఉప్మా సేమ్యా ఉప్మా..ఇది బ్రేక్ ఫాస్ట్ మాత్రమే కాదు..ఈవెనింగ్ స్నాక్ కూడా . చేయడం చాలా సింపుల్..కలర్ కలర్ గా కనిపించే ఈ వెరైటీ బ్రేక్ ఫాస్ట్ చిన్న పిల్లలతో సహా చాలా ఇష్టంగా తినేస్తారు.

కావల్సిన పదార్థాలు:
సేమియా (వెర్మిసెల్లి) - 2 cups
నీరు 1 ½cups
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
గ్రీన్ బటానీలు ½cup
క్యారట్ 1 (సన్నగా తరిగినవి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పసుపు ¼ tsp
ఆవాలు 1tsp
మినపప్పు: 1tsp
శెనగపప్పు ½ tsp
కరివేపాకు 6-7
ఎండు మిర్చి: 1
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ వేడి చేసి అందులో నూనె వేసి లైట్ గా కాగిన తర్వాత అందులో సేమియా వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
2. తర్వాత వేరే ప్లేట్ లోనికి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి.
3. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, ఎండు మరి్చి, ఉద్దిపప్పు, శెనగపప్పు, కరివేపాకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే ఉల్లిపాయలు కూడా వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
5. తర్వాత అందులో కొద్దిగా పసుపు, క్యారెట్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి మరియు టమోటో ముక్కలు కూడా వేసి మరో 5-6నిముషాలు వేగించుకోవాలి.
6. మొత్తం మిశ్రమం వేగిన తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకొన్న సేమియా, ఉప్పు, మరియు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
7. తర్వాత మూత పెట్టి 5-10నిముషాులు ఉడికించుకోవాలి.
8. ఉడికిన తర్వాత మూత తీసి నీరు మొత్తం పూర్తిగా ఇమిరిపోయే వరకూ సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి .
9. ఒక సారి నీరు మొత్తం డ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి అంతే టేస్టీ అండ్ ఈజీ సేమియా ఉప్మా రెడీ. ఈ డిష్ ను కొబ్బరి చట్నీతో ఎంజాయ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications