Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
టమోటో గ్రేవీ రిసిపి : టేస్టీ అండ్ హెల్తీ
టమోటో గ్రేవీ రిసిపి: సాధారణంగా మనం తయారుచేసుకొనే కూరలు ఎంత ప్రయత్నించినా గ్రేవీ అంతగా ఉండకపోవచ్చు. చాలా మందికి గ్రేవీ కూరలంటే మహా ఇష్టం ఉండొచ్చు. అలాంటి వారు టమోటోలను ఉపయోగించి చేసే ఈ గ్రేవీని ప్రయత్నించి చూడండి. ఈ టమోటో గ్రేవీ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు ఈ ఇండియన్ రిసిపిని రోటీలు, బ్రెడ్, మరియు రైస్ తో సర్వ్ చేయవచ్చు. ఇలాంటి టమోటో గ్రేవీ రిసిపిని కేరళ స్టైల్లో ఎక్కువగా తయారుచేస్తుంటారు . అయితే ఇదే టమోటో గ్రేవీ కాస్త వెరైటీగా తయారుచేసుకుంటే సౌత్ అండ్ నార్త్ ఇండియన్స్ చపాతీ రోటీలకు కాంబినేషన్ గా తింటారు.
టమోటో గ్రేవీ రిసిపికి మరికాస్త వెరైటీగా ఉండాలంటే టమోటో గ్రేవీకి ఉడికించిన కూరగాయ ముక్కలే కాదు, ఉడికించిన చికెన్ లేదా మటన్ ని కూడా జోడించి , వెజ్ లేదా నాన్ వెజ్ రుచుల్లో దీన్ని ఆరగించవచ్చు. మరి మీకు నచ్చిన పద్దతిని ఎంపిక చేసుకొని వెంటనే వంటను తయారుచేయడానికి సిద్దం అయిపోండి...
కర్రీ ట్రీట్: వంకాయ మరియు టమోటో రిసిపి

కావల్సిన పదార్థాలు:
- ఎండు మిర్చి: 4
- ధనియాలు: 2tsp
- జీలకర్ర: 1/2tsp
- మిరియాలు: 1tsp
- వాము: 1/2tsp
- దాల్చిన చెక్క: కొద్దిగా
- లవంగాలు: 3
- యాలకులు: 3
- అనాసపువ్వు: 1
డ్రమ్ స్టిక్(మునక్కాడ)-టమోటో కర్రీ: హెల్తీ సైడ్ డిష్
పేస్ట్ కోసం కావల్సిన పదార్థాలు:
- పెద్ద ఉల్లిపాయలు: 4
- పచ్చిమిర్చి: 4
- వెల్లుల్లి రెబ్బలు: 6
- అల్లం : చిన్న ముక్క
- గ్రేవీకోసం కావల్సిన పదార్థాలు:
- టమోటోలు 4-5
- కొబ్బరి పేస్ట్ : 2tsp
- బిర్యానీ ఆకులు : 2
- కస్తూరీ మేథీ: 1/2tsp
- కారం: 1tsp
- ధనియాలపొడి : 1tsp
- పసుపు: 1/4tsp
- కరివేపాకు : రెండు రెమ్మలు
- కొత్తిమీర తరుగు కొద్దిగా
- నూనె : సరిపడా
- ఉప్పు : రుచికి తగినంత
ప్రతి ఒక్కరికీ సహాయపడే టమోటో హెల్త్ బెనిఫిట్స్
తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీ జార్ లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వాము, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు వేసి మసాలా పొడిని తయారుచేసుకోవాలి.
2. తర్వాత పేస్ట్ కోసం సిద్దంగా పెట్టుకొన్న పదార్థాలను వేరే జార్ లో వేసి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి .
3. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి బిర్యానీ ఆకులు, కస్తూరీమేథీ, కరివేపాకు వేసి, ఒక నిముషం వేగించుకోవాలి.
4. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి అది వేగాక టమోటో ముక్కలు, కారం, ధనియాలపొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం మంట మీద వేగిస్తుంటే ఇది గ్రేవీలా తయారవుతుంది.
5. గ్రేవీలా ఉడికే సమయంలో అందులోనే కొబ్బరి పేస్ట్, ముందుగా తయారుచేసుకొన్న మసాలా పేస్ట్ వేసి బాగా కలగలిపి, 5నిముషాలు ఉడికించి 5 నిముషాల తర్వాత దింపేసుకోవాలి.
6. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా పల్చగా కూడా తయారుచేసుకోవచ్చు.
7. అంతే టమోటో గ్రేవీ రిసిపి రెడీ. దీన్ని రోటీలతో కలిపి తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. వెరైటీ కావాలనుకుంటే టమోటో గ్రేవీలోనే కొన్ని రకాల కూరగాయముక్కలు లేదా ఉడికించిన మటన్ లేదా చిక్న్ లేదా కోడిగుడ్లు జత చేసి ఉడికించుకోవచ్చు.



Click it and Unblock the Notifications