Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
లంచ్ కోసం: ఒక సులభమైనటువంటి టమోటో కర్రీ
టమోటో గ్రేవీ రిసిపి చాలా సింపుల్ రిసిపి . ఈ ఇండియన్ రిసిపిని రోటీ, బ్రెడ్ మరియు రైస్ కు కాంబినేషన్ గా సర్వ్ చేయవచ్చు . ఈ వంట కేరళ స్టైల్లో చాలా పాపులర్ అయినటువంటి రిసిపి. బిజీబిజీగా ఉండే వీక్ డేస్ లో ఏదైనా త్వరగా రెడీ చేయాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
మరి మీరు కూడా ఇటువంటి సింపుల్ రిసిపి తయారుచేయాలని కోరుకుంటున్నట్లైతే, ఈ రోజు లచ్ రిసిపికి ఇది ట్రై చేసి చూడండి . సింగిల్ గా ఉండే వర్కింగ్ ఉమెన్ లేదా మెన్ కూడా తయారుచేసుకోగల చాలా సింపుల్ రిసిపి ఇది. టమోటో రిసిపిని వివిధ పద్దతుల్లో తయారుచేసుకోవాలి. ఈ గ్రేవీకి మీరు ఏదైన వెజిటేబుల్స్ జోడించాలనుకుంటే అలా జోడించుకోవచ్చు . అలా చేయడం వల్ల మరింత హెల్తీ డిష్ గా తయారవుతుంది. టమోటో రిసిపి చపాతీలకు బెస్ట్ కాంబినేషన్ గా సౌత్ అండ్ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అయినటువంటి వంటి మరి మీరు కూడా ఒక సారి ట్రై చేసి రుచి చూడండి....

కావల్సిన పదార్థాలు:
టమోటోలు: 4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొబ్బరి తురుము: 1/2cup
కారం: 1tbsp
పసుపు: కొద్దిగా
ఆవాలు: 1tsp
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
కొబ్బరి నూనె: సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత టమోటో మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా గ్రేవీగా తయారుచేసుకోవాలి.
3. అంతలోపు మిక్సీ గ్రైండర్ లో కొబ్బరి తురుము, ఉల్లిపాయలు మరియు కొద్దిగా నీళ్ళు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ః
4. ఇప్పుడు ఈ పేస్ట్ ను ఉడుకుతున్న టమోటో గ్రేవీ మిశ్రమంలో పోయాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా జోడించుకోవచ్చు.
5. తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు మరియు కరివేాకు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని ఉడికించాలి.
6. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు కూడా పోసం మరో 10 నిముషాలు ఉడికించుకోవాలి. అంతే సింపుల్ అండ్ ఈజీ టమోటో గ్రేవీ రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications