Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వంకాయ బటర్ మసాలా కర్రీ: టేస్టీ అండ్ ఈజీ
మీరు వివిధ రకాల గ్రేవీలను ఇష్టపడుతున్నట్లైతే, అటువంటి వాటిల్లో ఇది ఒకటి . బ్రింజాల్ బట్టర్ మసాలా లేదా బ్రిజాల్ మఖానీ అని పిలుస్తారు. కొన్ని మసాలా దినుసులతో వంకాయను స్టఫ్ చేసి బట్టర్ లో ఫ్రై చేసి తయారుచేస్తారు. లేదా మసాలాలతో పాటు బట్టర్ ను కూడా చేర్చి, మిక్స్ చేసి వంకాయలో స్టఫ్ చేసి తయారుచేస్తారు.
చాలా సింపుల్ గా ఈ వంటలను తయారుచేయవచ్చు. సింపుల్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంకాయ కూరంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. ఈ వంకాయలో బట్టర్, ఇండియన్ మసాలాలు జోడించి వండితే చాలా రుచిగా ఉంటుంది. రుచికరమైన వంకాయలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం.

కావలసిన పదార్థాలు :
పొడవు వంకాయలు: 1/2Kg
ఎండుమిర్చి: 8-10
మినప్పప్పు: 2tbsp
ధనియాలు: 1tsp
ఉల్లిపాయలు: 4
వెన్న: 100grm
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 3tsp
తయారు చేయు విధానం :
1. ముందుగా వంకాయలను గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి కోసి ఉప్పునీటిలో వేయాలి.
2. తర్వాత ఓ బాణలిలో కొద్దిగా నూనె పోసి మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి. వీటిని మిక్సీలో వేసి రఫ్ గా పొడి చేసుకోవాలి.
3. తరువాత ఉల్లిపాయముక్కలను కూడా వేసి ముద్దలా చేసి అందులో తగినంత ఉప్పు, వెన్న కలపాలి.
4. ఇప్పుడు ఒక్కో వంకాయలో మసాలా కూరి ఉంచాలి.
5. తరువాత అడుగు మందం ఉండే గిన్నెలో కొద్దిగా నూనె వేసి వంకాయలను ఒకదానిపక్కన ఒకటి అమర్చి, మూతపెట్టి, సన్నటి మంటమీద మగ్గనిచ్చి దించేయాలి. అంతే వేడి వేడి వంకాయ వెన్న మసాలా సిద్ధమైనట్లే:!



Click it and Unblock the Notifications