Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్పైసీ అండ్ ఫ్లేవర్డ్ పుదీనా ఎగ్ కర్రీ
గుడ్డు ఆరోగ్యానికి చాల మంచిది. అది అందరికి తెలిసిన విషయమే. అందువల్లే వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇండియన్ వంటకాల్లో ఎగ్ కర్రీని చాలా సాధారణంగా ఎక్కువగా వండుతుంటారు. ఇది కారంగా రుచిగా ఉండటమే కాదు ప్లెయిన్ రైస్ తో తినడానికి చిక్కటి గ్రేవితో నూరూరిస్తుంటుంది.
ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం స్పెషల్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే స్పెషల్ ఎగ్ కర్రీ మీ సొంతం.

గుడ్లు: 3-4 (ఉడికించినవి)
ఉల్లిపాయలు: 2
వెల్లుల్లి: 4: 5 ప్యాడ్లు
పచ్చిమిరపకాయలు: 2-3
పసుపు: 1tsp
కారం: 1tsp
పుదీనా: కొద్దిగా
కొత్తిమీర: కొద్దిగా
జీలకర్ర: 1tsp
టమోటా సాస్: 1tsp
నీటి : ½cup
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాలా: ఒక చిటికెడు
నూనె: 3tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయ పొట్టు తీసి, నాలుగు బాగాలు కట్ చేసి మిక్సీలో వేయాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు, పుదీనా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మరియు కొత్తిమీర వేసి మెత్తని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ ను స్టౌమీద పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో ఉడికించి పెట్టుకొన్న గుడ్లు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత అదే పాన్ లో నూనె కొద్దిగా పక్కకు తీసేసి, కొద్దిపాటి నూనెతో అదే పాన్ ను తిరిగి స్టైమీద పెట్టి వేడయ్యా అందులో జీలకర్ర వేసి చిటపటలాడేలా చేయాలి .
5. జీలకర్ర చిటపటలాడా అందులో ముందుగా గ్రైండ్ చేసిపెట్టుకొన్న పేస్ట్ ను వేసి మీడియం మంట మీద 5-6నిముషాలు వేగించుకోవాలి.
6. ఒక్క పేస్ట్ లైట్ గా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం మరియు గరం మసాలా వేసి వేగించాలి.
7. తర్వాత అందులోనే టమోటో ముక్కలను కూడా వేసి ఒక నిముషం వేగించిన తర్వాత నీళ్ళు పోసి ఉడికించుకోవాలి .
8. గ్రేవీ చిక్కగా మారే సమయంలో ఫ్రై చేసి పెట్టుకొన్న గుడ్డును వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే ఒక రెండు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఎగ్ కర్రీ విత్ మింట్ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంతో వడ్డించాలి.



Click it and Unblock the Notifications