Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఎగ్ లెస్ పాన్ కేక్ -హెల్తీ బ్రేక్ ఫాస్ట్
పాన్ కేక్ వంటలంటే పిల్లలకు చాలా ఇష్టం. ఇష్టం కథ అలా ఉంచితే ఈ బ్రేక్ పాస్ట్ తయారు చేయడం చాలా సులభం. ఇది చాలా బిసీగా ఉన్నసమయంలో ..అల్పాహారాన్ని తయారు చేసే సమయం లేనప్పుడు ఇటువంటి సింపుల బ్రేక్ ఫాస్ట్ లు అతి సులభంగా అతి త్వరగా తయారయ్యే వాటి మీద ఆధారపడ్డం మంచిది. అయితే ఇటువంటి అల్పాహారాలకు గుడ్డు ఉపయోగించడం సాధారణం. అందుకే వెజిటేరియన్స్ ఈపాన్ కేక్స్ ను నిరాకరిస్తుంటారు. అయితే, దానికి చింతిచాల్సిన పనిలేదు. గుడ్డులేకుండా కూడా పాన్ కేకులు తయారు చేయవచ్చు.
గుడ్డులేకుండా పాన్ కేక్ తయారు చేయడం చాలా సులభం . సాధారణ పాన్ కేక్ లా కాకుండా ఎగ్ లెస్ పాన్ కేక్ 20నిముషాల్లో తయారు చేసేయవచ్చు. మరి ఈ సింపుల్ మరియు ఈజీ బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావల్సిన పదర్థాలు:
మైదా: 2cups
తేనె : 3tbsp
పాలు: 1cup
బట్టర్: 3tbsp
చెక్క పౌడర్: 1/2tsp
వెనిలా ఎసెన్స్ : 1/2tsp
బేకింగ్ పౌడర్: 1tsp
నీళ్ళు : అవసరంఅయితే
రాస్బెరీస్: 10
స్ట్రాబెర్రీస్: 4
బ్లూ బెర్రీస్ 6
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, చెక్కపౌడర్ మరియు పాలు వేసి బాగా మిక్స్ చేయలి. ఈ పదార్థాలన్నీ బాగా కలగలిసేలా కలుపుకోవాలి.
2. తర్వాత అవసం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.
3. తర్వాత పాన్ లో బట్టర్ వేసి కరిగించుకోవాలి . ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న మైదా మిశ్రమాన్ని పాన్ లో పోయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలగలిసేలా కలుపుకోవాలి.
4. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ మీద బట్టర్ రాసి,వేడియ్యాక, ఒక కప్పు మైదా మిశ్రమాన్ని పాన్ మీద పోయాలి. ఇప్పుడు పాన్ కేక్ మీద చిన్న చిన్న బుడగల్లా కనబడుతాయి. ఇప్పడు పాన్ కేక్ ను మరో ప్రక్కకు త్రిపి కాలనివ్వాలి. రెండు వైపులా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని బెర్రీస్ తో సర్వ్ చేయాలి. అంతే ఎగ్ లెస్ పాన్ కేక్ రెడీ.



Click it and Unblock the Notifications