Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
టేస్టీ అండ్ ఈజీ గ్రీన్ పీస్ చట్నీ
సాధారణంగా కొన్ని సందర్భాల్లో చాలా సింపుల్ రిసిపిలను కూడా ఇష్టపడుతారు. ముఖ్యంగా ఆంధ్రులకు చట్నీలతో సైడ్ డిష్ ఖచ్చితంగా కోరుకుంటారు. అటువంటి సైడ్ డిష్ వంటల్లో గ్రీన్ పీస్ చట్నీ ఒకటి.
ఈ గ్రీన్ పీస్ చట్నీ తయారుచేయడం చాలా సులభం మరియు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీన్ పీస్ చట్నీ, ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్ కు కాంబినేషన్ గా బాగుంటుంది. అలాగే ప్లెయిన్ రైస్ కు కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రుచికరమైన గ్రీన్ పీస్ చట్నీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
గ్రీన్ పీస్(పచ్చిబఠానీలు): 1cup
కొబ్బరి తురుము: 1cup
ఉల్లిపాయలు: 1మీడియం
పచ్చిమిర్చి: 2 చిన్నవి
అల్లం తురుము: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: సరిపడా
నూనె: 2tbsp
తయారుచేయు విధానం:
1. తాజాగా ఉండే పచ్చిబఠానీలను శుభ్రంగా కడిగి, నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో 2టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా వేయించుకోవాలి.
3. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, మరియు వెల్లుల్లి కూడా వేసి మరో 3నిముషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో గ్రీన్ పీస్ వేసి, కొద్దిగా ఉప్పు, బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత పాన్ లో కొబ్బరి తురుమును కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పాన్ మూత పెట్టి, కొన్ని నిముషాల పాటు ఉడకనివ్వాలి.
6. మొత్తం ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం రఫ్ గా చేసుకోవాలి. అప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది. అంతే గ్రీన్ పీస్ చట్నీ రెడీ. దీన్నిరైస్ లేదా ప్లెయిన్ దోసతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications