Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
గ్రీన్ పెప్పర్ బేబీ కార్న్ ఫ్రై రిసిపి టేస్టీ అండ్ హెల్తీ
రుచికరమైన మరియు స్వీట్ టేస్ట్ కలిగిన బేబీ కార్న్ రిసిపిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువ. ముఖ్యంగా వీటిలో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అంధిస్తాయి.
ఈ రుచికరమైన వెజిటేరియన్ రిసిపి వెజిటేరియన్ అత్యంత ఇష్టమైన స్పైసీ అండ్ టేస్టీ రిసిపి. ముఖ్యంగా వెజిటేరియన్ కు హెల్తీ ఫుడ్ కూడా. మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ వెజిటేరియన్ రిసిపి టేస్ట్ చూడాలంటే...ఎలా తయారుచేయాలో చూద్దాం.....

కావల్సిన పదార్థాలు:
చిన్న సైజు బేబీకార్న్: 1/2kg(కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్(గ్రీన్ పెప్పర్): 1(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
పెప్పర్ పౌడర్: 2tbsp
పసుపు: 1/2tsp
పచ్చిమిర్చి: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
నీళ్ళు: 1/2cup
తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. బాగా ఫ్రై అయ్యే వరకూ వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన లేదా తురిమిన ఉల్లిపాయ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే సన్నగా తరిగిన టమోటోముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
5. టమోటోకొద్దిగా మెత్తబడే సమయంలో పెప్పర్ పౌడర్ మరియు పసుపు వేసి మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
6. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న క్యాప్సికమ్ మరియు బేబీకార్న్ ముక్కలు వేసి మసాలాలతో కలగలుపుతూ వేగించుకోవాలి.
7. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి , మొత్తం పదార్థాలల్నీ డ్రైగా మారే వరకూ వేగించుకోవాలి.
8. పూర్తిగా డ్రై ఫ్రై అయ్యే సమయంలో రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
9. అమీకు అవసరం అనిపిస్తే ఇంగువ కూడా జోడించుకోవచ్చు.



Click it and Unblock the Notifications











