Latest Updates
-
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే..
హరియాలీ చోలే మసాల: టేస్టీ అండ్ హెల్తీ
మన రెగ్యులర్ వంటలకు గ్రీన్ కలర్ (గ్రీన్ లీవ్స్ )జోడించడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. గ్రీన్ లీఫ్స్ తో వంటలను చాలా అద్భుతంగా, టేస్టీగా తయారుచేయడానికి కొత్త ఆసక్తి మరియు శ్రమ ఉంటే చాలు, ఒక వెరైటీ టేస్టీ డిష్ లు రెడీ అయిపోతాయి.
అలాంటే గ్రీన్ డిష్ లలో హరియాలీ చోలే మసాలా ఒకటి. ఇది పర్ఫెక్ట్ సైడ్ డిష్ రిసిపి. హరియాలీ చోలే మసాలాను శెనగలతో తయారుచేస్తారు. ముఖ్యంగా వీటికి కొత్తిమీర మరియు పుదీనా మిక్స్ చేయడం వల్ల గ్రీన్ కలర్లో నోరూరిస్తుంటుంది.
ముఖ్యాంగా మసాలకు ఇండియన్ మసాలాదినుసులను ఉపయోగించడం వల్ల మరింత ఆరోమా వాసనతో నోరూరింస్తుంటాయి. కాబట్టి, ఈ స్పెషల్ హరియాలీ చోలే మసాల రిసిపి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
శెనగలు: 250grms
కొత్తిమీర తరుగు:- 1tbsp
పుదీనా తరుగు: ½tbsp
వెల్లుల్లి రెబ్బలు: 8
పచ్చిమిర్చి: 4
ఉల్లిపాయ: 1 (సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటోలు: 2 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి: 1tsp
పసుపు : ½ tsp
రోస్ట్ చేసిన జీలకర్ర పొడి: 1tsp
ధనియాల పొడి: 2tsp
గరం మసాలా పౌడర్: ½ tsp
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిడా
నూనె : 2tbsp
నీళ్ళు: 2 cups
తయారుచేయు విధానం:
1. ముందుగా శనగలను శుభ్రం చేసి నీటిలో వేసి రాత్రంత నానబెట్టుకోవాలి.
2. తర్వాత రోజు ఉదయం ఆ నీటిని వంపేసి, గింజలను కుక్కర్లో వేసి, సరిపడా నీళ్ళు, మరియు ఉప్పు వేసి, మూత పెట్టి, మీడియం మంట మీద రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసిన కుక్కర్లో ఆవిరి తగ్గే వరకూ పక్కన పెట్టుకోవాలి.
4. కొద్దిపేసటి తర్వాత మూత తీసి, గింజల నుండి నీరు వేరుగా వంపి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మిక్సీ జార్ లో కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, టమోటో, మరియు పచ్చిమిర్చి వేసి మొత్తం మిశ్రమాన్ని గ్రైట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. అంతలోపు పాన్ స్టౌ మీద పెట్టి, నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
7. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయలముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
8. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో నిముషం ఫ్రై చేసుకోవాలి.
9. ఇప్పుడు ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసిన పేస్ట్ కొత్తిమీర పేస్ట్ ను వేసి మరో 5నిముషాలు పచ్చివాసన పోయే వరకూ వేగించుకోవాలి .
10. ఇప్పుడు అందులో పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, ఉప్పు వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
11. మొత్తం మసాలాలు ఫ్రూ చేసుకొన్న తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న శెనగలు వేసి మిక్స్ చేయాలి.
12. కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే హరియాలి చోలే మసాలా రెడీ. ఈ రుచికరమైన వంటను పరాటలు మరియు భతురాతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications