Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ : మేతి పరోటా రిసిపి
మన జీవితంలో హెల్తీ ఫుడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు . ఆరోగ్య మీద అవగాహన ఉన్నవారు ఎవరు కూడా అనారోగ్యకరమైన మరియు ఫ్యాట్ ఫుడ్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోరు. కాబట్టి మన దినచర్యను ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మొదలు పెట్టాలి. అటువంటి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలలో ఒకటి మేతి పరోటా...
మేతి పరోఠా చాలా త్వరగా తయారు చేసుకొనేటటువంటి బ్రేక్ ఫాస్ట్ రిసి. ఈ మేతి పరోటా ఆరోగ్యానికి చాలా మంచిది. మేతి పరోటాను ఏదైనా సబ్జి లేదా పెరుగుతో తినవచ్చు. ఈ పరోఠాలు వివిధ రకాల ఫ్లేవర్స్ మరియు న్యూట్రిషియన్స్ తో తయారు చేస్తారు.
ఆకలి భోరుమన్నప్పుడు మామూలు రోటీ బోరు అనిపించినప్పుడు...మరోటీ మరేదయినా మంచి వెరైటీ తినాలినిపిస్తే..పరాఠాలు ట్రై చేయండి. రోటీలో రారాజు పరాఠా..రుచికి రుచి, ఒంటికింత పుష్టి...కొన్ని రకాల రోఠీలు ఆకలి తీర్చుతాయి..మరికొన్నేమో ఆకలిని పెంచుతాయి...ఒకసారి రుచి చూశారంటే మరోటీ..మరోటీ..కావాలంటారు. మరి ఆ మరోఠీ మెంతి పరోఠా.. బరువు తగ్గించే మహారాజు..రోటీలలో రారాజు పరాఠా..

కావల్సిన పదార్థాలు:
గోధుమ పిండి: 2cups
శనగపిండి: 1cup
అజ్వైన్(కారమ్ సీడ్స్): 1tsp
అల్లం వెల్లల్లి పేస్ట్ : 1tsp
ధనియాల పొడి: 1tsp
ఉప్పు , కారం : రుచికి తగినంత
గరం మాసాల పౌడర్: 1/2tsp
సన్నగా తరిగిన మెంతి ఆకులు: 2cups
నూనె : 2tsp(పిండిలో కలపడానికి/మరో రెండు స్పూన్లు పరాఠా వత్తడానికి, పెనం మీద కాల్చడానికి)
తయారు చేయు విధానం :
1. ముందుగా ఇక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటి వేసి బాగా కలపాలి.
2. ఈ మిశ్రమానికి తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
3. దీనిని మొదట చపాతీలా వత్తి పైన నూనె రాసి మడత పెట్టి మళ్ళీ వత్తాలి. దీనిని పెనం మీద వేసి రెండు వైపులా కాల్చాలి.
4. చపాతీని కనీసం ఐదు ఆరు సార్లు తిరగేయాలి. తిరగేసిన ప్రతి సారీ కొద్దిగా నూనె వేస్తూ కాల్చిన పరాఠా చాలా రుచిగా ఉంటుంది. ఊబకాయం సమస్య ఉంటే నూనెను తక్కువగా వేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications